TS: కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలింది.. సీఎం రేవంత్!

కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలిందని సీఎం రేవంత్ అన్నారు. ఏనాడు ఆయన మహిళల సమస్యలు పట్టించుకోలేదన్నారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా ఏర్పాటు చేసిన 'మహిళ శక్తి' సభలో మహిళలే బీఆర్ఎస్ ను గద్దె దించారని చెప్పారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.

New Update
Telangana: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి కూటమికే ఓటేయాలి..సీఎం రేవంత్ రెడ్డి

Congress Mahila Sadassu Meeting: కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలిందని సీఎం రేవంత్ (CM Revanth Reddy) అన్నారు. ఏనాడు ఆయన మహిళల సమస్యలు పట్టించుకోలేదన్నారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా ఏర్పాటు చేసిన 'మహిళ శక్తి' సభలో మహిళలే బీఆర్ఎస్ ను గద్దె దించారని చెప్పారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీ చచ్చిపోయిన పర్వాలేదు..
మాట తప్పని, మడమ తిప్పని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. తల్లుల కడుపుకోత గుర్తించి, ఆ బాధను చూడలేక కనికరించిందని చెప్పారు. కళ్లముందు భర్తను కొల్పోయిన మహిళ.. ఏపీలో పార్టీ చచ్చిపోయిన పర్వాలేదు.. కేంద్రంలో అధికారం పోయిన లెక్కచేయకుండ తెలంగాణ ఇచ్చిందని పొగిడారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ, సోనియమ్మ అన్నారు. మహిళా నాయకత్వంలో పనిచేస్తుంటే గర్వంగా ఉందని చెప్పారు. కేసీఆర్ కు (KCR) మహిళల ఉసురు తగిలిందని చెప్పారు. హారీష్‌ , కేటీఆర్ ఆటోలకు డబ్బులిచ్చి ధర్నాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం వారికి నచ్చలేదని, అందుకే నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆరు పథకాలతోపాటు రాజీవ్ ఆరోగ్య శ్రీ ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు.

కోటీశ్వరులను చేస్తాం..
అలాగే కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలని చూస్తే బీఆర్ఎస్, బీజేపీని తరిమికొట్టాలన్నారు. సలాక ఎర్రగ కాల్చి పిర్రల మీద పెట్టండి. పొరకాటలు తిరగేసి కొట్టుర్రి అని పిలుపిచ్చారు. నల్ల చట్టాలు తెచ్చి, డెభ్భై కోట్ల రైతులను ఆగం చేసిన మోడీ.. ఢిల్లీలో రైతులను కాల్చి చంపి పించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆదాయం రెండితలు చేస్తామని మోసం చేశారని గుర్తు చేశారు. మోడీ ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. అమిత్ షా ను నమ్మొద్దు అన్నారు. సోనియమ్మ తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని ఎద్దేవా చేసిన మోడీని ఎలా నమ్ముతామన్నారు. ఇప్పటికీ కేసీఆర్ చీకటి ఒప్పందాలే నడిపిస్తున్నారని, ఆయనకు సిగ్గు రాలేదు.. అంతా దొంగబుద్ది అన్నారు. వచ్చే ఐదేళ్లలో కోటీ మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు.

ఇక ఈ సభలో మహిళలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన రెండు వందల అరవై ఏడు కోట్ల ముప్పై లక్షలు చెక్కులను అందించారు. గ్రామీణ ప్రాంతాల సంఘాలు, పట్టణ సంఘాలకు చెక్కులు అందించారు. 13,49 గ్రూపులకు చెక్కులు అందించారు.

Also Read: కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా..! -భట్టి

Advertisment
Advertisment
తాజా కథనాలు