KCR: ఉపఎన్నిక.. ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్. దివంగత నేత సాయన్న కూతురు, లాస్య సోదరి నివేదిత పేరును ప్రకటించారు. లాస్య నందిత మృతితో కంటోన్మెంట్‌లో  ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే.

KCR: ఉపఎన్నిక.. ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్
New Update

Cantonment BRS MLA Candidate: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. దివంగత నేత సాయన్న కూతురు నివేదిత పేరును ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) మృతితో కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. మరోసారి సాయన్న కుటుంబంలోని వ్యక్తికే టికెట్ ఇచ్చారు కేసీఆర్ (KCR). మరోవైపు ఈసారి కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ ను బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు ఇస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ముందు నుంచి అనుకున్నట్టుగానే సాయన్న కూతురు నివేదిత కు టికెట్ ఇచ్చారు.

క్రిశాంక్ కు షాక్..

బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జిగా ఉన్న క్రిశాంక్ కు మరోసారి పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ కోసం బీఆర్ఎస్ అధిష్టానం వైపు ఆశగా చూసిన క్రిశాంక్ కు కేసీఆర్ షాక్ ఇచ్చారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ ను దివంగత నేత సాయన్న కూతురు లాస్య కు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన లాస్య కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై విజయం సాధించారు. కంటోన్మెంట్ లో గులాబీ జెండా ఎగరవేశారు. అయితే.. ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. కాగా.. కంటోన్మెంట్ లో ఉప ఎన్నిక వచ్చింది. ఈసారైనా తనకు టికెట్ వస్తుందని భావించిన క్రిశాంక్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి కూడా తనకు కాకుండా సాయన్న కూతురు నివేదితకు పార్టీ టికెట్ ఇచ్చింది.

కాంగ్రెస్ నుంచి బీజేపీ నేత..

కాంగ్రెస్(Congress) సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థిగా శ్రీగణేష్ పేరును హైకమాండ్ ప్రకటించింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించిన లాస్య నందిత(Lasya Nanditha) ఇటీవల ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident) లో మరణించిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్ ఎన్నికలతోనే ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు.

Also Read: కేసీఆర్‌లాగే రేవంత్ చేస్తున్నారు.. ఈటల సంచలన వ్యాఖ్యలు

#lok-sabha-elections-2024 #mla-lasya-nanditha #kcr #brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe