Delhi : ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో శుక్రవారం అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) కు ఈడీ(ED) ఆఫీసులోనే వైద్య పరీక్షలు(Medical Tests) పూర్తి చేయించారు అధికారులు. నేడు కవితను రౌస్ రెవెన్యూ కోర్టులో హాజరపరచనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కార్యచరణను మరింత వేగవంతం చేశారు.
అమల్లోకి 144 సెక్షన్..
ఈ క్రమంలోనే ఢిల్లీ కార్యాలయం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా ఈడీ కార్యాలయం వద్దకు వస్తారనే అంచనాలతో ముందుగానే ఈడీ ఆఫీసు వద్ద 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక కవితను శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లిన అధికారులు.. రాత్రంతా ఈడీ కార్యాలయంలో ఉంచారు.
ఇది కూడా చదవండి: RSP : కవిత అరెస్ట్ ను ఖండించిన ప్రవీణ్.. ప్రజలు మూర్ఖులు కాదంటూ విమర్శలు!
కోర్టులోనే తేల్చుకుంటాం:
ఇదిలావుంటే.. కవితపై కఠిన చర్యలు తీసుకోమని స్వయంగా ఈడీనే న్యాయస్థానంలో అఫిడవిట్ ఇచ్చినట్లు కవిత న్యాయవాదులు చెబుతున్నారు. ఈడీ అధికారులు మాత్రం దాన్ని ఖండిస్తున్నారు. అప్పట్లో సమన్లు వాయిదా వేస్తామని మాత్రమే చెప్పామని, అందులో అరెస్టు ప్రస్తావన లేదన్నది వారు వాదిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) లోనే తేల్చుకుంటామని కవిత తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు.