ఆ కోరిక దాని ద్వారా తీరిందంటున్న కత్రినా కైఫ్‌!

వైవిధ్యమైన, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలో నటించాలనే తన కోరిక ‘మెరీ క్రిస్మస్’ సినిమాతో నెరవేరిందని కత్రినా తెలిపింది.ఇందులో ఆమె ఎన్నో సాహసాలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. అంతేకాకుండా ఈ చిత్రం ప్రమోషన్స్‌ కోసం కత్రినా ఏకంగా రోడ్‌ ట్రిప్స్‌ కూడా వేస్తోందట.

New Update
ఆ కోరిక దాని ద్వారా తీరిందంటున్న కత్రినా కైఫ్‌!

బాలీవుడ్‌ అందాల భామ కత్రినా కైఫ్‌ గురించి ఎవరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మల్లీశ్వరీ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అందరి హృదయాలను దొచుకుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆమెకు మాత్రం అభిమానులు చాలా మందే ఉన్నారు.

తాజాగా ఈ బ్యూటీ టైగర్‌ 3 చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ యాక్షన్‌ సీన్లతో అందరి అలరించింది. ఆమె తాజాగా నటించిన చిత్రం మెరీ క్రిస్మస్‌ విడుదలకు సిద్దంగా ఉంది. ఇందులో కూడా ఆమె ఎన్నో సాహసాలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. అంతేకాకుండా ఈ చిత్రం ప్రమోషన్స్‌ కోసం కత్రినా ఏకంగా రోడ్‌ ట్రిప్స్‌ కూడా వేస్తోందట.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కత్రినా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెబుతూ ఆమె సినిమా పై మరిన్ని హైప్స్‌ పెంచే ప్రయత్నం చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా మోటార్‌ సైకిల్‌ రైడింగ్‌ చేయడం గురించి తెలిపింది.

ముందులో తనకు బండి నడపడం అసలు వచ్చేది కాదని కత్రినా వెల్లడించింది. ‘జిందగీ నా మిలేగీ దొబారా’ మూవీ షూటింగ్ సమయంలో నేర్చుకున్నట్లు ఆమె తెలిపింది.ఆ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో అర్థరాత్రి తరువాత బైక్‌ తీసుకుని రోడ్ల మీదకి వచ్చేదాన్ని అని కత్రినా చెప్పింది. బైక్ టిప్స్‌ కోసం స్పెయిల్ ట్రైనింగ్‌ స్కూల్ కి కూడా వెళ్లినట్లు వివరించింది.

అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఇంటి నుంచి యష్‌ రాజ్‌ స్టూడియోస్‌ వరకు బండి నడిపేదానిని అని వివరించిది. రాత్రి పూట ట్రాఫిక్‌ కారణంగా బైక్‌ నడపడం సరిగా వచ్చేది కాదని, కానీ కొద్ది రోజుల పాటు అలాగే ఎంతో ట్రై చేశానని ఆమె వివరించింది. నేను బైక్ నేర్చుకునే సమయంలో నాతో పాటు ఓ వ్యక్తి ఉండేవాడు. అతడు ఎవరు అనేది మాత్రం నేను బయటకు చెప్పను” అని తెలిపింది.

ఇక వైవిధ్యమైన, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలో నటించాలనే తన కోరిక ‘మెరీ క్రిస్మస్’ సినిమాతో నెరవేరిందని కత్రినా తెలిపింది.

Also read: కాపురంలో చిచ్చు పెట్టిన అనుమానం.. భార్యను 12 సార్లు పొడిచి.. ఆ పై తాను కూడా!

Advertisment
తాజా కథనాలు