Kate Middleton About Cancer Diagnosis: బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్డన్ (Kate Middleton) తాను క్యాన్సర్ (Cancer) తో పోరాడుతున్నట్లు.. అందుకు కీమో థెరపీ చేయించుకుంటున్నట్లు వివరించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. గత కొద్ది రోజులుగా కేట్ ఆచూకీ తెలియడం లేదని ఆమెకి ఏదో అయ్యిందని పెద్ద ఎత్తున వాదనలు వినిపించాయి. దీంతో బ్రిటన్ మాతృదినోత్సవం రోజున ఆమె ఎడిట్ చేసిన ఫొటో విడుదల చేయడంతో రాజ కుటుంబం పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
తాజాగా వాటికి అన్నింటికి చెక్ పెడుతూ.. ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో తాను క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు.. అందుకు కీమో థెరపీ చేయించుకుంటున్నట్లు వివరించారు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయం గురించి గోప్యత పాటించాలని కేట్ ప్రజలకు పిలుపునిచ్చారు.
కేట్ గత జనవరి లో కడుపునకు శస్త్రచికిత్స (Surgery) కోసం ఆసుపత్రిలో చేరింది. ఆ తరువాత నుంచి ఆమె గురించి ఎలాంటి సమాచారం లేదు. కేట్ గత క్రిస్మస్ నుంచి కనిపించడం లేదని తెలుస్తుంది. కేట్ అస్వస్థత వార్త తెలియగానే, ఆమె భర్త తమ్ముడు ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేగాన్ మార్క్లే ఆమె వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేట్ వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తన సందేశంలో పేర్కొన్నాడు.
ఇప్పుడు ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేథరీన్ ఎలిజబెత్ అని పిలవబడే కేట్ మిడిల్టన్ బ్రిటన్ యువరాజు విలియం భార్య. బ్రిటిష్ సింహాసనానికి వారసులలో ప్రిన్స్ విలియం మొదటివాడు. కేథరీన్, విలియం 29 ఏప్రిల్ 2011న వివాహం చేసుకున్నారు. జార్జ్, కరోలిన్, లూయిస్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేథరీన్ 20 కంటే ఎక్కువ స్వచ్ఛంద, సైనిక సంస్థలకు పోషకురాలిగా ఉన్నారు. యువరాణి క్యాన్సర్‌తో బాధపడుతున్నారనే వార్త కచ్చితంగా ఆమె అభిమానులకు పెద్ద షాక్ అనే చెప్పవచ్చు.
Also Read: మాస్కో ఉగ్ర ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. స్పందించిన ప్రధాని మోదీ!