Kasthuri Shankar: అవకాశం రావాలంటే కమిట్ అవ్వాల్సిందే.. క్యాస్టింగ్ కౌచ్ పై గృహలక్ష్మి నటి ఓపెన్!

ఫిల్మ్ ఇండస్ట్రీల్లో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ఒక బిగ్ ప్రాజెక్ట్ కు సైన్ చేసిన తర్వాత దానికి ఒప్పుకోలేదని సినిమానుంచి తొలగించారని తెలిపింది. ప్రతీ అమ్మాయి ఏదో ఒక దశలో లైంగిక వేధింపులకు గురై ఉంటుంది. కానీ ఎవరూ నిజం ఒప్పుకోరని చెప్పింది.

Kasthuri Shankar: అవకాశం రావాలంటే కమిట్ అవ్వాల్సిందే.. క్యాస్టింగ్ కౌచ్ పై గృహలక్ష్మి నటి ఓపెన్!
New Update

Kasthuri: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశం కొంతకాలంగా తీవ్ర చర్చేనీయాంశమైన విషయం తెలిసిందే. కాగా ఎంతోమంది నటీనటులు దీనిపై స్పందించారు. కొంతమంది నటీమణులు స్వయంగా తాము ఎదుర్కొన్న అనుభాలను నిర్భయంగా బయటపెట్టారు. అయితే తాజాగా సినిమా అవకాశాలు, లైంగిక వేధింపుల అంశంపై సీనియర్ నటి, గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ కస్తూరి శంకర్ సంచలన కామెంట్స్ చేశారు.

అందరూ ఒప్పుకోవాల్సిన నిజం..
ఈ మేరకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ తనకు ఎదురైన అనుభవాలు పంచుకుంది.. 'సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. స్టార్ డమ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒక దశలో లైంగిక వేధింపులకు గురై ఉంటుంది. కానీ చాలా మంది ఒప్పుకోరు. అదృష్టం కొద్ది మాకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని అమ్మాయి ప్రారంభంలో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేయాల్సిందే. నాకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలున్నాయి. నేను ఒప్పుకోలేదని చాలా సినిమాల్లో నుంచి తీసేశారు. కొన్ని ఎపిసోడ్స్ లేపేశారు. అయితే తెలుగులో అలాంటి అనుభవం ఎదరుకాలేదు' అంటూ పలు విషయాలు ప్రస్తావించింది.

ఇది కూడా చదవండి: Vijay: అభిమానుల అత్యుత్సాహం.. హీరో విజయ్ కి గాయాలు!

వరస్ట్ ఎక్స్పీరియన్స్..
ఇక మలయాళంలో అయితే వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పింది. పెళ్లైన తర్వాత మలయాళంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దానికి ఒప్పుకోలేదని సినిమానుంచి తీసేశారని వాపోయింది. అన్నిరంగాల్లో ఈ తరహా అనుభవాలు అమ్మాయిలకు ఎదురవుతున్నాయని, మేస్త్రికి కూలీకి మధ్య ఎఫైర్స్ ఉంటాయని తెలిపింది. చిత్ర పరిశ్రమలో కూడా రెండు రకాల మనుషులు ఉంటారు. అందరూ చెడ్డవారు కాదు. ఏదీ ఏమైనా మనం ఎలా ఉన్నామనేది చాలా ముఖ్యమంటూ హితబోద చేసింది.

#casting-couch #kasturi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe