యాదాద్రి పుణ్యక్షేత్రంలో కార్తికమాసం విశిష్టతను చాటి చెప్పే ఆధ్యాత్మిక పర్వాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దేవస్థానం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. 5 రోజులపాటు సాగే ఈ కార్యక్రమాల్లో భాగంగా…ఈనెల 23వ తేదీని ఆలయ సన్నిధిలో కార్తికమాస విశిష్టతపై ప్రవచనం, 24వ తేదీన విష్ణు పుష్కరిణిలో దీపోత్సవం, 25వ తేదీని ఆలయ బ్రహ్మోత్సవ మండపం దగ్గర దీపోత్సవం, 26న సామూహిక హరినామ సంకీర్తనలు, 27న దామోదర వ్రత పర్వాలు జరుగుతాయని ఈవో తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 5.30గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు పర్వాలు కొనసాగుతాయని ఈవో గీత వివరించారు. చివరిరోజు ప్రధాన ఆలయంలో అన్నకూటమి వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Yadadri: కార్తీక మాసంలో యాదాద్రికి వెళ్తున్నారా? అయితే… ఈ వివరాలు మీ కోసమే..!!
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాస్థానంలో కార్తికమాసం విశిష్టతను చాటే ఆధ్యాత్మిక పర్వాలు షురూ కానున్నాయి. ఈ మేరకు దేవస్థానం సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఈ పర్వాలు ఐదు రోజులపాటు జరగనున్నాయి. ఈనెల 23న ప్రారంభమై..27వ తేదీన ముగియనున్నాయి.

Translate this News: