Deputy CM DK Shivakumar: ఈ సందర్భంగా విజయవాడలో డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. మూడు అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు. తెలంగాణ మొత్తం మార్పుకోసం చూస్తోందని.. సోనియాకు కృతజ్ఞత చెప్పాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఇక ఈ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో రెస్ట్ తీసుకోవాల్సిందేనని డీకే శివకుమార్ విమర్శించారు. అయితేకాదు కేసీఆర్ ఎప్పుడూ మమ్మల్ని తలుచుకోనిదే నిద్రపోడని ఆయన దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున ఐదు గ్యారెంటీలు అమలవుతున్నాయని డీకే శివకుమార్ తెలిపారు. సీఎం కుర్చీకోసం కొట్లాటలు జరగడం లేదని.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు గెలిచినా ఉప ఎన్నికలు గ్యారెంటీ: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సమాజం మార్పు కోసం చూస్తోందని కేపీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. తెలంగాణకు మేం డబ్బులు పంపిస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. మేం డబ్బులు పంపిస్తే బీఆర్ఎస్ నిద్ర పోతుందా..? అని డీకే శివకుమార్ ప్రశ్నించారు. అంతేకాక తెలంగాణలో అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారని శివకుమార్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ప్రజలు కూడా ఇప్పటికే కేసీఆర్‌ను సాగ నంపడానికి సిద్ధమయ్యారని శివకుమార్ జోస్యం చెప్పారు.
ఫేక్ లెటర్‌పై ఇదివరకే ఫిర్యాదు
బీఆర్ఎస్ తన పేరుతో నకిలీ లెటర్ సృష్టించారని, కర్ణాటకలో ఫేక్ లెటర్‌పై ఇదివరకే ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు. బెంగళూరులో టీఆర్ఎస్ పార్టీపై ఈ అంశంపై కేసు నమోదు చేశామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా బెంగళూరునే చూస్తున్నారన్నారు. బెంగళూరులో పెట్టుబడి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని శివకుమార్ తెలిపారు. బెంగుళూరులో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని నిలబెట్టుకుంటున్నామన్నారు. 9వ తేదీన క్యాబినెట్‌లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి హామీలపై దృష్టి పెడతామన్నారు. సీఎం పదవి కోసం కర్ణాటకలో కొట్లాటలు ఏమి లేవు.. ఉంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండాలన్నారు. ఇదిలాఉంటే.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నేతలు స్పీడ్ పెంచారు. అంతకుముందు రాహుల్, సోనియా తెలంగాణలో పర్యటించారు. ఈ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతుంది.