పథకాల కోసం డబ్బులు లేవు.. సీఎం వీడియో వైరల్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కర్ణాటకలో తాము చెప్పిన పథకాలను అమ్మల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని అన్నారు. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉచిత హామీలు ఇచ్చే ముందు ఆలోచించుకోవాలని చురకలు అంటించారు. By V.J Reddy 19 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Karnataka CM Siddaramaiah: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లోను చర్చనీయాంశంగా మారాయి. సీఎం సిద్ధరామయ్య మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 'ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఓట్ల కోసం ఏదో అన్నాం అనుకోండి, అది ఇస్తాం ఇది ఇస్తాం అంటాం, అంత మాత్రాన అన్నీ ఫ్రీ గా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది, అయితే డబ్బులు లేవు' అంటూ వ్యాఖ్యానించారు. అయితే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ పార్టీ పై విజయంసాధించి కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ALSO READ: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆరు గ్యారేటీలపై అప్డేట్ సిద్ధరామయ్య వీడియో.. తెలంగాణ ప్రజల్లో ఆందోళన.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ పథకాలపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు (Congress 6 Guarantees) అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అవి అమలు చేస్తుందా? లేదా? అనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus), ఆరోగ్య శ్రీ కార్డు పరిమితి రూ.15 లక్షలకు పెంచింది. అయితే, రైతు బంధు నిధులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా.. ఇంకా చాలా మంది ఖాతాలో నగదు జమ కాకపోవడంతో రైతుల ఆందోళన వ్యక్తం చస్తున్నారు. ALSO READ: పార్లమెంట్ ఎన్నికలు.. నేడు ఇండియా కూటమి భేటీ కర్ణాటక సీఎం వ్యాఖ్యలపై.. కేటీఆర్ కౌంటర్.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ (X) లో కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). కేటీఆర్ ట్విట్టర్ లో.. 'ఎన్నికల వాగ్దానాలు/హామీలు ఇవ్వడానికి డబ్బు లేదు: కర్ణాటక సీఎం!, ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా ఇలానే చేస్తుందా?, విపరీతమైన ఉచితాలపై ప్రకటన చేసే ముందు మీరు ప్రాథమిక పరిశోధన, ప్రణాళికను చేయకూడదా?' అని ప్రశ్నించారు. No money to deliver poll promises/guarantees says Karnataka CM ! Is this the future template for Telangana too after successfully hoodwinking the people in elections ? Aren’t you supposed to do basic research and planning before making outlandish statements? https://t.co/JOcc4NLsiq — KTR (@KTRBRS) December 19, 2023 #ktr #telangana-news #congress-party #karnataka-cm-siddaramaiah #siddaramaiah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి