America : అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) లో తెలంగాణ(Telangana) కు చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం(Students Dead) పాలయ్యారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లిన వారు ఇలా మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివునిపల్లి గ్రామానికి చెందిన పార్శి గౌతమ్ కుమార్, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన ముక్క నివేశ్ అమెరికాలోని అరిజోనా స్టేట్ వర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. వరుస రెండు రోజులు సెలవులు కావడంతో వీరిద్దరూ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి దగ్గర్లోని వాటర్ ఫాల్స్ చూసేందుకు కారులో బయల్దేరారు.
వీరు ప్రయాణిస్తున్న కారును ఫినిక్స్ పరిధిలోని మెట్రో టౌన్ సెంటర్ వద్ద ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో గౌతమ్ , నివేశ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి అక్కడే ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన పై అరిజోనా పోలీసులు(Arizona Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో నెలైతే..
గౌతమ్ మరో నెలరోజుల్లో ఇండియాకి తిరిగి వచ్చేవాడు.. అతని రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు కుమారుడి మరణ వార్త తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు. నివేశ్ తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే.
Also read: ఘోర అగ్ని ప్రమాదం..మంటలార్పుతున్న 10 ఫైర్ ఇంజిన్లు!