Karan Johar: ఆ హాస్య నటుడు నాపట్ల చీప్ గా వ్యవహరించాడు.. కరణ్ జోహార్ ఎమోషనల్ పోస్ట్! బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడీయన్ గా పేరుగాంచిన ఒక ప్రముఖ వ్యక్తి తన పట్ల చీప్ గా వ్యవహరించినట్లు చెబుతూ దర్శకనిర్మాత కరణ్ జోహార్ నెట్టింట పోస్ట్ పెట్టాడు. 25 ఏళ్లకుపైగా ఇండస్ట్రీలో ఉంటున్న తనను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే ఇలా వ్యవహరించడం బాధకరంగా ఉందన్నాడు. By srinivas 07 May 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bollywood: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ (Karan Johar) తన 25 ఏళ్ల కెరీర్ లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టారు. ఒకవైపు సినిమాలు తెరకెక్కిస్తూనే మరోవైపు కరణ్ విత్ కాఫీ షోతో అభిమానులను అలరిస్తున్న ఆయన.. కెరీర్ లో అడుగుపెట్టినప్పటినుంచి చాలా అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. ఈ మేరకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ అనుభవాలను పంచుకున్న ఆయన.. స్టార్ కమెడీయన్ గా పేరుగాంచిన కెట్టన్ సింగ్ తన గురించి చీప్ గా వ్యవహరించినట్లు చెబుతూ నెట్టింట పోస్ట్ షేర్ చేశాడు. My god!!! I'm screaming🗣️🗣️ They are literally drilling into the ground. Ufff yaaarr🫦❤️🔥#DeepikaPadukone #RanveerSingh #DeepVeer #KoffeeWithKaran8 pic.twitter.com/YYWBrAzpG6 — DeepVeer TR🤰👨🍼 (@deepveergoals) October 22, 2023 ఇలా వ్యవహరించడం బాధకరం.. ఈ మేరకు పోస్ట్ ను పరిశీలిస్తే.. ‘అమ్మతో కలిసి ఇంట్లో టీవీ చూస్తున్నా. అప్పుడే ఓ ఛానల్‌లో ప్రసారమయ్యే రియాలిటీ కామెడీ షో ప్రోమో ప్లే అయింది. అందులో ఒక కమెడియన్ నన్ను చీప్‌గా అనుకరించారు. ఇలాంటివి సోషల్ మీడియాలో కనిపిస్తే ఊరూ పేరూ లేని వారు చేశారనుకుని వదిలేయొచ్చు. కానీ, 25 ఏళ్లకుపైగా ఇండస్ట్రీలో ఉంటున్న నన్ను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే ఇలా వ్యవహరించడం బాధకరంగా ఉంది’ అంటూ వాపోయారు. ఇక ‘లైగర్’, ‘బ్రహ్మాస్త్ర: పార్ట్ 1’, ‘సెల్ఫీ’, ‘యోధ’ తదితర చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించగా.. ‘యే దిల్ హై ముష్కిల్’, ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇది కూడా చదవండి: Vote: కలిసికట్టుగా.. ఒకే జట్టుగా 96 మంది కుటుంబసభ్యులు ఓటేశారు అయితే దీనిపై స్పందించిన హాస్యనటుడు కెట్టన్ సింగ్.. టీవీలో కరణ్ ను అనుకరించినందుకు క్షమాపణలు చెప్పాడు. ప్రజలను అలరించడానికే ఇలా చేశానని, ఇందులో తప్పుడు ఉద్దేశం ఏమీ లేదన్నారు. #bollywood #karan-johar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి