Mudragada : జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ, ఆయన కుమారుడు! కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శుక్రవారం ఉదయం వైసీపీలో చేరారు. ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. By Bhavana 15 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Mudragada : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) శుక్రవారం ఉదయం వైసీపీ(YCP) లో చేరారు. ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్(Tadepalle Camp Office) లో సీఎం జగన్(CM Jagan) సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని ముద్రగడ తెలిపారు. ముద్రగడ పార్టీ లో చేరడం గురించి గత కొంత కాలం నుంచి ఏపీలో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో అయితే జనసేనలో చేరతారనే వార్తలు కూడా వచ్చాయి. ముద్రగడ ఇంటికి పవన్ వస్తారని , అప్పుడే జనసేనలోకి వెళ్తారని ప్రచారం సాగింది. కానీ పవన్ తీరు నచ్చలేదని ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయనకు లేఖలు కూడా రాశారు. దాని తరువాత ఆయన జనసేనలో చేరడం లేదని స్పష్టం చేశారు. దీంతో వైసీపీ ఆయనకు సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది. దీంతో వైసీపీ నేతలు కొందరు ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన వైసీపీ లోకి వెళ్లాలని ముద్రగడ నిర్ణయించుకున్నారు. అసలు ఈ నెల 14నే వైసీపీలో చేరాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈరోజు ఆయన వైసీపీలోకి వెళ్లారు. Also Read : వెలుగులోకి ప్రణీత్ రావు వాట్సాప్ చాట్..రేవంత్ పైనే ఫోకస్ అంతా! #ycp #jagan #ap #mudragada-padmanabham #giri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి