RC16 : రామ్ చరణ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్!

రామ్ చరణ్ RC16 సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. నేడు ఆయన బర్త్ డే కావడంతో మూవీ టీమ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update
RC16 : రామ్ చరణ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్!

Kannada Star Siva Rajkumar On Board For RC16 Movie :  పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం RC16. మైత్రీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 20న ఘనంగా ప్రారంభమైంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు.స్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు రాగా.. మేకర్స్ తాజాగా అధికారిక ప్రకటన చేశారు. నేడు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ బర్త్ డే కావడంతో ఈ సందర్భంగా RC 16 మూవీ టీమ్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగానే సినిమాలో అయన ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిపారు. ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read : ‘భారతీయుడు 2’ ట్విట్టర్ టాక్.. సేనాపతిగా కమల్ విశ్వరూపం, కానీ అదొక్కటే మైనస్..!

రూరల్ విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమాకు 'పెద్ది' అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రామ్ చరణ్ మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. AR రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు