/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-18-2.jpg)
Karnataka: కన్నడ హీరో దర్శన్ కు మరో ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే రేణుకాస్వామి హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతుండగా.. తాజాగా దర్శన్ మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. దర్శన్‌కు చెందిన బెంగళూరు ఫామ్‌హౌస్‌ను చూసుకునే మేనేజర్ శ్రీధర్ మృతదేహాన్ని ఫామ్‌హౌస్ సమీపంలోనే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక ఆత్మహత్త్య సమయంలో సూసైడ్ నోట్‌తో పాటు వీడియో సందేశం కూడా లభించాయి. ఒంటరితనం కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని, దీనికి తన బందువులకు, స్నేహితులకు గానే ఎలాంటి సంబంధం లేదని నోట్, వీడియోలో తెలిపారు శ్రీధర్. అయితే.. దర్శన్ కేసు నడుస్తున్న సమయంలోనే ఆయన మేనేజర్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం పోలీసులకు అనుమానాల్ని కలిగిస్తోంది. శ్రీధర్ ఆత్మహత్య, రేణుకస్వామి హత్యకు ఏదైనా లింక్ ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.