Kannada congress : రాజకీయాలొద్దు..డీకే భారీ ఆఫర్ ను తిరస్కరించిన కన్నడ నటుడు శివరాజ్ కుమార్

పాపం ఆదిలోనే హంసపాదు పడింది కర్ణాటక కాంగ్రెస్ కు. లోక్ సభ ఎన్నికలకు బాగా ప్రిపేర్ అవుదామనుకుంది..సినీ నటుడు శివ రాజ్ కుమార్ ను ఆయుధంగా వాడాలనుకుంది. కానీ ఆ ప్లాన్ పట్టాలకెక్కకుండానే ఎర్ర జెండా ఊపేశాడు శివన్న.

Kannada congress : రాజకీయాలొద్దు..డీకే భారీ ఆఫర్ ను తిరస్కరించిన కన్నడ నటుడు శివరాజ్ కుమార్
New Update

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అన్ని రాష్ట్రాలూ వీటికి సన్నద్ధం అవుతున్నాయి. కర్ణాటక కూడా దీనికి రెడీ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం స్థాపించిన కాంగ్రెస్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా పై చేయి సాధించాలనుకుంటోంది. ఇప్పటి నుంచే సీట్లు, సర్దుబాట్లు ప్రారంభించింది. దీని కోసం డిప్యూటీ సీఎం శివరాజ్ కుమార్ రంగంలోకి దిగారు. అందరూ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. అలాగే ప్రఛారాన్ని కూడా భారీగా చేయాలని అనుకుంటోంది కర్ణాటక కాంగ్రెస్. దాని కోసం సినిమా తారలను ఉపయోగించుకోవాలనుకున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అయితే బావుంటుందని సెలెక్ట్ చేసుకున్నారు. ఆయనను వెళ్ళి కలిశారు డీకే శివకుమార్.

Also Read:అన్నా అని పిలిచింది..నేనున్నా అంటూ ఆపన్న హస్తం ఇచ్చిన రేవంత్

అయితే కాంగ్రెస్ ప్లాన్స్ కు శివరాజ్ కుమార్ బ్రేకులు వేశారు. డీకే శివన్నను కలిసి ప్రచారం విషయంతో పాటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ను కూడా ఆఫర్ చేశారు. ఆయనకు ఏ నియోజకవర్గం కావాలో అక్కడి నుంచే పోటీ చేయమంటూ ఫ్రీ హ్యండ్ కూడా ఇచ్చారు. కానీ శివరాజ్ కుమార్ దీనికి ఒప్పుకోలేదు. తాను రాజకీయాల్లోకి ఇప్పుడు రాలేనని...చేతిలో ఐదారు సినిమా ప్రాజెక్టులున్నాయంటూ చెప్పేశారు. సినిమాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు...కలిసి ప్రజలకు సేవ చేద్దాం అని డీకే ఒప్పించడానికి ప్రయత్నించినా కూడా...రానంటే రానని కరాఖండిగా చెప్పేశారు శివరాజ్ కుమార్.

ఈ మీటింగ్, చర్చల తర్వాత శివరాజ్ కుమార్ దీని గురించి మాట్లాడారు. తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని తేల్చి చెప్పేశారు. మా నాన్న మాకు తెరమీద మాత్రమే నటించమని చెప్పారని...రాజకీయాల్లోకి వెళ్ళమని చెప్పలేదని అన్నారు. నాన్న చెప్పిందే చేస్తానంటూ కన్ఫార్మ చేశారు. నటనే తమ జీవితం అని...ప్రజలు కూడా తమని అది చూసే అభిమానించారని...అక్కడితోనే మాలైన్ ముగుస్తుందని అన్నారు. రాజకీయాలు మాకొద్దు. వాటి కోసం ఉన్నవాళ్ళు వేరేగా ఉన్నారు అంటూ టాపిక్ ను ఎండ్ చేసేసారు శివరాజ్ కుమార్.

#congress #karnataka #loksabha #dk-siva-kumar #sivaraj-kumar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe