స్త్రీలో ఆ శరీర భాగాలే కాదు..ఇతర అవయవాలు కూడా ఉన్నాయి: కంగనా ఫైర్‌!

నా స్విమ్‌ సూట్‌ ఫోటో చూపించి ఇలా నీచంగా మాట్లాడారంటే మీ వక్రబుద్ది బయటపడింది...నేను రాజకీయాల్లోకి రావడానికి కేవలం నా శరీరాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నానని అనుకుంటున్నారా? . నేను ఇప్పటి వరకు ఒక నటిని, రచయిత, దర్శకుడు, నిర్మాత, విప్లవ రైట్‌ వింగ్‌ ఇన్‌ ఫ్లూయెన్సర్‌ని..నా బదులు భవిష్యత్తులో గొప్ప నాయకుడిగా ఎవరైనా యువకుడు ఉండి ఉంటే అతని గురించి కూడా ఇలాగే శరీరాన్ని అమ్ముకున్నాడు అనే మాట అనగలరా? స్త్రీలు కేవలం సెక్స్‌ కోసం మాత్రమే కాదు. వారికి మెదడు, గుండె, చేతులు, పాదాలు వంటి ఇతర అవయవాలు కూడా ఉన్నాయి. గొప్ప నాయకుడిగా ఉండటానికి అవసరమైన ప్రతిదాన్ని కలిగి ఉంటారని'' కంగనా ట్విట్టర్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

స్త్రీలో ఆ శరీర భాగాలే కాదు..ఇతర అవయవాలు కూడా ఉన్నాయి: కంగనా ఫైర్‌!
New Update

కంగనా రనౌత్..బాలీవుడ్‌, టాలీవుడ్‌ లో ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫైర్‌ బ్రాండ్‌..ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఇచ్చి పడేస్తుంది అంతే. కంగనా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. తాజాగా కంగనా దసరా సందర్భంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన రావణ దహన కార్యక్రమంలో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. రావణ దహనం చేసిన తొలి మహిళగా కంగనా చరిత్ర సృష్టించారు.

ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు కంగనా బికినీ ధరించి ఉన్న ఫోటోను ఓ దానిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఆమె పై విమర్శలు కురిపిస్తున్నారు. మోడీ ప్రభుత్వాన్ని అలరిస్తున్న లేడీ ఈమెనే అంటూ కామెంట్లు పెట్టారు. వీటిని చూసిన బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ కంగనా పై రెచ్చి పోయారు.

Also read: ఎన్నికల దెబ్బకు పెళ్లి బాజాలు మోగే ఇళ్లల్లో ఆందోళన..ఎందుకంటే..!!

కంగనా కోసం ఎస్పీజీ కాస్త ఎక్కువగానే స్పందిస్తోందని అన్నారు.ఎస్పీజీ అనేది ఒక గౌరవం లేని సంస్థ అని విమర్శించారు. ఆమెను రావణ దహనానికి ఆమెను పిలిచారంటే ఆమెకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్థం అవుతుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ విషయం గురించి కంగనా కూడా స్పందించింది.

'' నా స్విమ్‌ సూట్‌ ఫోటో చూపించి ఇలా నీచంగా మాట్లాడారంటే మీ వక్రబుద్ది బయటపడింది...నేను రాజకీయాల్లోకి రావడానికి కేవలం నా శరీరాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నానని అనుకుంటున్నారా? . నేను ఇప్పటి వరకు ఒక నటిని, రచయిత, దర్శకుడు, నిర్మాత, విప్లవ రైట్‌ వింగ్‌ ఇన్‌ ఫ్లూయెన్సర్‌ని..నా బదులు భవిష్యత్తులో గొప్ప నాయకుడిగా ఎవరైనా యువకుడు ఉండి ఉంటే అతని గురించి కూడా ఇలాగే శరీరాన్ని అమ్ముకున్నాడు అనే మాట అనగలరా?

స్త్రీలు కేవలం సెక్స్‌ కోసం మాత్రమే కాదు. వారికి మెదడు, గుండె, చేతులు, పాదాలు వంటి ఇతర అవయవాలు కూడా ఉన్నాయి. గొప్ప నాయకుడిగా ఉండటానికి అవసరమైన ప్రతిదాన్ని కలిగి ఉంటారని'' ఆమె ట్విట్టర్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

#social-media #twitter #kangana #subrahmanya-swami #ramleela #bjp-em-mp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe