స్త్రీలో ఆ శరీర భాగాలే కాదు..ఇతర అవయవాలు కూడా ఉన్నాయి: కంగనా ఫైర్!
నా స్విమ్ సూట్ ఫోటో చూపించి ఇలా నీచంగా మాట్లాడారంటే మీ వక్రబుద్ది బయటపడింది...నేను రాజకీయాల్లోకి రావడానికి కేవలం నా శరీరాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నానని అనుకుంటున్నారా? . నేను ఇప్పటి వరకు ఒక నటిని, రచయిత, దర్శకుడు, నిర్మాత, విప్లవ రైట్ వింగ్ ఇన్ ఫ్లూయెన్సర్ని..నా బదులు భవిష్యత్తులో గొప్ప నాయకుడిగా ఎవరైనా యువకుడు ఉండి ఉంటే అతని గురించి కూడా ఇలాగే శరీరాన్ని అమ్ముకున్నాడు అనే మాట అనగలరా? స్త్రీలు కేవలం సెక్స్ కోసం మాత్రమే కాదు. వారికి మెదడు, గుండె, చేతులు, పాదాలు వంటి ఇతర అవయవాలు కూడా ఉన్నాయి. గొప్ప నాయకుడిగా ఉండటానికి అవసరమైన ప్రతిదాన్ని కలిగి ఉంటారని'' కంగనా ట్విట్టర్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.