బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కొంతకాలంగా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ నటి బీజేపీ నుంచే పోటీ చేస్తుందని, అయితే ఎప్పుడు, ఏ నియోజక వర్గంనుంచి పోటీలో దిగబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది. గతంలోనూ కంగన కూడా పాలిటిక్స్ లోకి రావడంపై పాజిటివ్ గానే స్పందించింది. అయితే 2024లో లోక్ సభ ఎన్నికలు రాబోతుండగా నటి రాజకీయ ప్రవేశంపై ఆమె తండ్రి అమర్ దీప్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఈ మేరకు కూతురు కంగన పొలిటికల్ ఎంట్రీ గురించి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసిన అమర్ దీప్.. 'బాలీవుడ్ సూపర్ స్టార్ కంగనా రనౌత్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఆమె ఏ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనేది బీజేపీ హైకమాండ్ త్వరలో నిర్ణయిస్తుంది' అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా ఆమె ఫ్యాన్స్ నటికి కంగ్రాట్స్ చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : AP: స్పా ముసుగులో వ్యభిచారం.. నగరం నడిబొడ్డునే గలీజ్ దందా
ఇదిలావుంటే.. ఇటీవల ద్వారకలోని శ్రీ కృష్ణుడి ఆలయంలో పూజలు నిర్వహించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ భగవానుడు ఆశీర్వదిస్తే తప్పక పోటీ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ఇక సన్నిహితుల సమాచారం ప్రకారం.. కంగన హిమాచల్ ప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.