Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ షాకింగ్ డెసిషన్.. సినిమాలకు కంగనా రనౌత్ గుడ్ బై?

తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా రనౌత్ తన సినీ ప్రయాణంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను కనుక ఎంపీగా గెలిస్తే సినిమాలకు గుడ్ బై చెప్తానని, ఎందుకంటే ఈ సినీ ప్రపంచం ఓక అబద్దం. మనకు పైకి కనిపించేంత అందంగా, వాస్తవికంగా ఉండదని తెలిపింది.

New Update
Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ షాకింగ్ డెసిషన్.. సినిమాలకు కంగనా రనౌత్ గుడ్ బై?

Actress Kangana Ranaut Interview : బాలీవుడ్ (Bollywood) లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నకంగనా రనౌత్ (Kangana Ranaut) తాజాగా ఓ సంచలన ప్రకటన చేసింది. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక అబద్దం అని చెబుతూనే తాను అనుకున్నది జరిగితే ఏకంగా సినిమాలు చేయడం మానేస్తా అంటూ చెప్పడం బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కంగనా రనౌత్ ప్రెజెంట్ లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం నుంచి కంగనా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. కాగా ప్రచారంలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీ ప్రయాణంపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

Also Read : ‘దేవర’ ఫియర్ సాంగ్ వచ్చేసింది.. మాటల్లేవ్, ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది!

ఎంపీగా గెలిస్తే సినిమాలకు గుడ్ బై

తాజా ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ.." నేను కనుక ఎంపీగా గెలిస్తే సినిమాలకు గుడ్ బై చెప్తా.. ఎందుకంటే ఈ సినీ ప్రపంచం ఓక అబద్దం. మనకు పైకి కనిపించేంత అందంగా, వాస్తవికంగా ఉండదు. పైగా నాకు ఒకే పని ఎక్కువ కలం చేయాలని అనిపించదు. అందుకే హీరోయిన్ గా బోర్ కొట్టినప్పుడు కథలు రాస్తుంటా, సినిమాలను డైరెక్ట్ చేస్తుంటా, నిర్మిస్తుంటాను. నాకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తుంటాను" అని చెప్పుకొచ్చింది. దీంతో కంగనా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

Advertisment
తాజా కథనాలు