Kanaka Durga Chits AMG Suicide : అతనొక చిట్ ఫండ్ కంపెనీ(Chit Fund Company) ఉద్యోగి. తన పని సిన్సియర్ గా చేసుకుని వెళ్ళిపోయే రకం. ఉద్యోగ ధర్మంలో భాగంగా కంపెనీలో కోట్ల రూపాయలు డిపాజిట్లు చేయించారు. కానీ పై అధికారుల వల్ల ప్రాణాలు కోల్పోయారు. వరంగల్(Warangal) కనకదుర్గ చిట్ ఫండ్స్(Kanaka Durga Chit Funds) లో AMGగా పని చేసిన భాస్కర్ రెడ్డి(Bhasker Reddy) కథ ఇది. ఇతను ఆత్మహత్య(Suicide) చేసుకుని చనిపోయారు. చనిపోతూ తన చావుకు కారణం వారిద్దరే అంటూ అంటూ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నారు.
Also Read : Andhra Pradesh : గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం..రెండు బిల్లుల ఆమోదం.
సూపైడ్ నోట్ రాసిన భాస్కర్‌రెడ్డి..
భాస్కర్‌రెడ్డి నోట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. "నా చావుకు కారణం చిట్‌ఫండ్ ఛైర్మన్ తిరుపతిరెడ్డి(Tirupati Reddy), ఎండీ కమలాకర్‌రెడ్డి(Kamalakar Reddy) లే స్పష్టంగా రాశారు భాస్కర్రెడ్డి. కోట్లరూపాయలు డిపాజిట్ చేయించానని..కస్టమర్లకు డబ్బులు ఇవ్వకుండా ల్యాండ్ ఇస్తామని ఓనర్లు అంటున్నారు. కానీ కస్టమర్లు ఒప్పుకోవడంలేదని చెప్పారు. డబ్బులిప్పించమని కస్టమర్లు నా వెంట పడుతున్నారు. ఇద్దరూ నా మాట వినడం లేదు. ఓనర్లు, కస్టమర్ల మధ్య నలిగిపోయా. ఇంక నా వల్ల కాదు, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ నోట్ లో రాసారు భాస్కర్‌రెడ్డి. కస్టమర్లకు న్యాయం చేయండి, నేను చనిపోతున్నాని చెప్పారు.
ఛైర్మన్, ఎండీ అరెస్ట్...
భాస్కర్‌రెడ్డి సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కనకదుర్గ చిట్‌ఫండ్ ఛైర్మన్, ఎండీని అరెస్ట్ చేశారు. దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
Also Read : BREAKING: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. హస్తం పార్టీలోకి పెద్దపల్లి ఎంపీ ?