Movies:వాహ్ సూపర్ టైటిల్..మణిరత్నం-కమల్ మూవీ పేరు థగ్ లైఫ్

లోక నాయకుడు కమల్, మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న మూవీ కేహెచ్ 234. 36 ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమాకు థగ్ లైఫ్ అని పేరు పెట్టారు. దీంతో పాటూ కమల్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు.

New Update
Movies:వాహ్ సూపర్ టైటిల్..మణిరత్నం-కమల్ మూవీ పేరు థగ్ లైఫ్

థగ్ లైఫ్....లోక నాయకుడు కమల్ కొత్త సినిమా పేరు. మణిరత్నం దర్శకత్వంలో కమల్ నటిస్తున్న మూవీ ఇది. 36 ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. విక్రమ్ తర్వాత కమల్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో థగ్ లైఫ్ ఒకటి. ఈ సినిమా షూటింగ్ ఇంతకు ముందే ప్రారంభం అయింది. కమల్ తన సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తో పాటు మద్రాస్ టాకీస్ అండ్ రెడ్ జెయింట్ మూవీస్ తో కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Also Read:క్రికెట్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్..రాబ్ లిండా యూట్యూబ్ ఛానెల్ ఆపేశారు.

కమల్, మణిరత్నం కాంబినేషన్ లో 36 ఏళ్ళ క్రితం నాయకుడు మూవీ వచ్చింది. అప్పట్లో ఆ మూవీ ఒక సంచలన్. చాలా పెద్ద హిట్ అయింది. 1987లో నాయకుడు సినిమా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ లో థగ్ లైఫ్ సినిమా వస్తోంది. విక్రమ్ సినిమాతో కమల్ హసన్, పీఎస్2 తో మణిరత్నం మంచి జోరు మీద ఉన్నారు. అందుకే ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ మూవీ వస్తుంది అనేసరికి ఫ్యాన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

థగ్ లైఫ్ మూవీకి ఏఆర్ రహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ తో పాటూ కమల్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే చిన్న టీజర్ ను కూడా చూపించారు. అందులో స్టంట్స్ చాలా బాగున్నాయి అంటున్నారు. మూవీ టైటిల్ కూడా కమల్ స్థాయికి తగ్గట్టు ఉంది అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు