Tamilnadu: రెండు రోజుల్లో శుభవార్త చెబుతా..కమల్ హసన్

దేశంలో ఎన్నికల హడావుడి మొదలయ్యింది. దాదాపు అన్ని పార్టీలూ వీటికి సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో లోకనాయకుడు కమల్ హసన్ మరో రెండు రోజుల్లో శుభవార్త చెబుతానని ప్రకటించారు.

Kamal Haasan : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. రాజ్యసభకు కమల్ హాసన్?
New Update

Kamal Haasan: కమల్ హసన్...ఈ యన గురించి తెలియని భారతీయుడు ఉండడు. యాక్టింగ్‌కు ఈయనో క్లాస్ పుస్తకం. కమల్ చేసినన్ని ప్రయోగాలు, వెరైటీ పాత్రలు ఇంకెవ్వరూ చేయలేదు. అయితే కమల్ యాక్టింగ్‌తో పాటూ రాజకీయాల్లోనూ ఇంట్రస్ట్ ఉంది. మక్కల్ నీది మయ్యం అనే పార్టీని కూడా పెట్టారు కమల్ హసన్. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దీనికి సంబంధించి రెండు రోజుల్లో శుభవార్త చెబుతా అంటున్నారు కమల్ (Kamal Haasan). పార్లమెంట్‌ ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నామని.. తమకు మంచి అవకాశాలు వస్తాయనుకుంటున్నామని తెలిపారు కమల్. రెండు రోజుల్లో పొత్తుకు సంబంధించి నిర్ణయం ప్రకటిస్తామని కమల్‌ హాసన్‌ వెల్లడించారు.

డీఎంకేతో కమల్ పొత్తు?

తమిళనాడు అధికారిక పార్టీ డీఎంకేతో (DMK) కమల్ హసన్ ఎమ్ఎన్ఎమ్ పొత్తు పెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని గత ఏడాది సెప్టెంబర్‌లో డీఎంకే నాయకుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ కూడా చెప్పారు. అంతకు ముందు సనాతన ధర్మం మీద ఉదయనిధి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కమల్ మద్దతుగా నిలిచారు. కమల్ హసన్ 2018లో మక్కల్ నీది మయ్యం (Makkal Needhi Maiam) పార్టీని పెట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో, 2021 తమిళనీడు అసెంబ్లీలో కమల్ ఓటమి పాలయ్యారు.

ప్రస్తుతం కమల్ హసన్ థగ్ లైఫ్ (Thug Life) అనే సినిమాను చేస్తున్నారు. దీంతో పాటూ శంకర్ దర్వకత్వంలో వస్తున్న భారతీయుడు-2లో కమల్ నటిస్తున్నారు.

Also Read:Maharastra:పులికి ఉన్న బుద్ధి మనకు లేదయ్యో..చూసి నేర్చుకోండి

#politics #tamilnadu #kamal-hassan #mnmpraty
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe