Kamal Haasan Reveals Why He Rejected Robo Movie : సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ - సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కాంబోలో వచ్చిన 'రోబో' బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన '2.ఓ' ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే రోబో మూవీలో విలన్ గా మొదట కమల్ హాసన్ ను అనుకున్నారట. కానీ కమల్ అందుకు నో చెప్పాడు. దానికి గల కారణాన్ని ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే అప్పట్లో శంకర్ తో (Director Shankar) ఆయన హీరోగా చేయాల్సిన 'రోబో' ఎందుకు కార్యరూపం దాల్చలేదనే విషయాన్ని సైతం బయటపెట్టాడు.
అందుకే వెనకడుగు వేసా...
‘ఐ-రోబో’ అనే ఇంగ్లిష్ నవలను తెరకెక్కిస్తే బాగుంటుందని నేను, శంకర్, రచయిత సుజాత (ఎస్. రంగరాజన్) 90ల్లోనే అనుకున్నాం. హీరో పాత్రకు సంబంధించి లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. కానీ, ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. చిత్ర పరిశ్రమలో రెమ్యూనరేషన్, డేట్స్.. ఇలా ఎన్నో లెక్కలుంటాయి. అప్పటి మార్కెట్‌నూ దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా చేయకపోవడమే మంచిదనిపించింది. అందుకే నేను వెనకడుగేశా. నా స్నేహితుడు శంకర్ మాత్రం దాన్ని వదల్లేదు. సరైన సమయంలో ‘రోబో’ను రూపొందించి, ఘన విజయం అందుకున్నాడు" అని చెప్పుకొచ్చాడు.
అలా కమల్ హాసన్ నో చెప్పడంతో డైరెక్టర్ శంకర్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో 'రోబో' సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వత ఆ సినిమాకి కొనసాగింపుగా '2.ఓ'లో ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ యాక్ట్ చేశారు. ఇక శంకర్ - కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఇండియన్ 2' జూలై 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.