Kamal Haasan : నేను, శంకర్ 'రోబో' చేయాలని అప్పట్లోనే అనుకున్నాం.. కానీ : కమల్ హాసన్ రజినీకాంత్ 'రోబో' మూవీలో విలన్ గా మొదట కమల్ హాసన్ ను అనుకున్నారట. కానీ కమల్ అప్పటి మార్కెట్‌నూ దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా చేయకపోవడమే మంచిదని నో చెప్పాడట. ఈ విషయాన్ని ఆయన తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు. By Anil Kumar 30 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Kamal Haasan Reveals Why He Rejected Robo Movie : సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ - సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కాంబోలో వచ్చిన 'రోబో' బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన '2.ఓ' ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే రోబో మూవీలో విలన్ గా మొదట కమల్ హాసన్ ను అనుకున్నారట. కానీ కమల్ అందుకు నో చెప్పాడు. దానికి గల కారణాన్ని ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే అప్పట్లో శంకర్ తో (Director Shankar) ఆయన హీరోగా చేయాల్సిన 'రోబో' ఎందుకు కార్యరూపం దాల్చలేదనే విషయాన్ని సైతం బయటపెట్టాడు. అందుకే వెనకడుగు వేసా... ‘ఐ-రోబో’ అనే ఇంగ్లిష్ నవలను తెరకెక్కిస్తే బాగుంటుందని నేను, శంకర్, రచయిత సుజాత (ఎస్. రంగరాజన్) 90ల్లోనే అనుకున్నాం. హీరో పాత్రకు సంబంధించి లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. కానీ, ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. చిత్ర పరిశ్రమలో రెమ్యూనరేషన్, డేట్స్.. ఇలా ఎన్నో లెక్కలుంటాయి. అప్పటి మార్కెట్‌నూ దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా చేయకపోవడమే మంచిదనిపించింది. అందుకే నేను వెనకడుగేశా. నా స్నేహితుడు శంకర్ మాత్రం దాన్ని వదల్లేదు. సరైన సమయంలో ‘రోబో’ను రూపొందించి, ఘన విజయం అందుకున్నాడు" అని చెప్పుకొచ్చాడు. Also Read : ‘యానిమల్’ బ్యూటీ వేసుకున్న ఈ బ్లాక్ డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే? అలా కమల్ హాసన్ నో చెప్పడంతో డైరెక్టర్ శంకర్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో 'రోబో' సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వత ఆ సినిమాకి కొనసాగింపుగా '2.ఓ'లో ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ యాక్ట్ చేశారు. ఇక శంకర్ - కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఇండియన్ 2' జూలై 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. #kamal-haasan #director-shankar #robo-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి