Telangana: నేడు తిరుమలకు కల్వకుంట్ల శోభ.. ఆ మొక్కు చెల్లించేందుకేనా!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సతీమణి కల్వకుంట్ల శోభ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. హైదరాబాద్ నుండి ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న అనంతరం ఆమె తిరుమల పయనం అవుతారు. తిరుమలలోని పద్మావతి విఐపి గెస్ట్ హౌస్ ఏరియాలో ఆమె కొద్దిసేపు ఉన్న అనంతరం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొంటారు. ఇప్పటికే టిటిడి అధికారులు ఆమెకు బస్సు ఏర్పాట్లతో పాటు దర్శన ఏర్పాట్లను చేశారు.

New Update
Telangana: నేడు తిరుమలకు కల్వకుంట్ల శోభ.. ఆ మొక్కు చెల్లించేందుకేనా!

Kalvakuntla Shoba to Visit Tirumala: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సతీమణి కల్వకుంట్ల శోభ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. హైదరాబాద్ నుండి ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న అనంతరం ఆమె తిరుమల పయనం అవుతారు. తిరుమలలోని పద్మావతి విఐపి గెస్ట్ హౌస్ ఏరియాలో ఆమె కొద్దిసేపు ఉన్న అనంతరం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొంటారు. ఇప్పటికే టిటిడి అధికారులు ఆమెకు బస్సు ఏర్పాట్లతో పాటు దర్శన ఏర్పాట్లను చేశారు. కాగా, ఆమె ఒంటరిగా శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు మరో చర్చకు దారి తీస్తుంది. సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. శోభ తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి రావడం అందరి దృష్టి కేసీఆర్ ఆరోగ్యంపై పడింది. కేసీఆర్ ఆరోగ్యం కోసం ఆమె శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిందా? సాధారణంగానే తిరుమలేశుడికి దర్శనం కోసం వచ్చారా? అనే చర్చ నడుస్తోంది.

ఓవైపు ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ బిజీగా ఉండటం.. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిన నేపథ్యంలో విదేశాల్లో నిర్వహిస్తున్న సభలకు కవిత వెళ్లడంతో శోభ మాత్రమే శ్రీవారి దర్శనానికి పయనమయ్యారు. సాధారణంగానే శోభ ఆలయాల సందర్శన చేస్తుంటారు. అయితే, కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని వార్తలు వస్తుండటం.. గత 3 వారాలుగా కేసీఆర్ బయటకు రాకపోవడంతో తెలంగాణ ప్రజల్లో ఆయోమయం నెలకొంది. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందా? లేక ఏమైనా సీరియస్‌గా ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నిన్ననే క్లారిటీ ఇచ్చిన మంత్రి కేటీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి కేటీఆర్ శుక్రవారమే క్లారిటీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు కేటీఆర్ తెలిపిన విషయ తెలిసిందే. అయితే, గత మూడు వారాల నుంచి ఆయనకు ఇంకా బయటకు రాకపోవడం, ఆరోగ్యంపై ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో సర్వత్రా అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మంత్రి కేటీఆర్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఛాతిలో ఇన్‌ఫెక్షన్ ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ విశ్రాంతిలో ఉన్నారని తెలిపారు. ఛాతిలో సెంకడరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని తెలిపారు. కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్.. ప్రస్తుతం బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడంతో మరింత ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆయన కొలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు కేటీఆర్. ఈ విషయాన్ని ఓ మీడియా సంస్థకు వెల్లడించారు.

Also Read:

TSRTC Special Buses : దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త

రవితేజకు సారీ చెప్పిన బాలీవుడ్ నటుడు.. అసలు ఏం అయిదంటే..?

Advertisment
తాజా కథనాలు