Kalki 2898AD : రిలీజ్ కు ముందే 'కల్కి' సెన్షేషనల్ రికార్డ్.. ఫస్ట్ ఇండియన్ మూవీగా రేర్ ఫీట్!

'కల్కి 2898AD' మూవీ ప్రీ సేల్స్ లో సరికొత్త రికార్డు సాధించింది. రిలీజ్ కి ఇంకా 8 రోజులు ఉండగానే ఈ సినిమా ప్రీ సేల్స్ అక్కడ 2 మిలియన్ డాలర్స్ దాటిపోయింది. రిలీజ్‌కి ముందు ఓ సినిమా ఇంతలా బిజినెస్ చేయడం ఇదే తొలిసారి అని మూవీ టీమ్ చెబుతోంది.

New Update
Kalki 2898 Trailer: ఈసారి ప్రిపేరై వచ్చాను.. అస్సలు ఓడిపోను: దద్దరిల్లిన కల్కీ ట్రైలర్!

Kalki 2898AD Pre Sales In North America : ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి 2898AD' (Kalki 2898AD) పై టాలీవుడ్ (Tollywood) లో పెద్దగా బజ్ లేదు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసినప్పటికీ ప్రమోషన్స్ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఇక్కడ అంత హైప్ కనిపించడం లేదు. కానీ ఓవర్సీస్ లో మాత్రం ప్రభాస్ (Prabhas) క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అక్కడ ఏమాత్రం ప్రమోషన్ చేయకుండానే సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రీ సేల్స్ లో సరికొత్త రికార్డు సాధించింది.

అప్పుడే 2 మిలియన్ డాలర్స్...

ఓవర్సీస్ లో ప్రభాస్ కు భారీ మార్కెట్ ఉందనే తాజాగా మరోసారి నిరూపితం అయింది. నార్త్ అమెరికా (North America) లో కల్కి ప్రీ సేల్స్ బిజినెస్ భారీగా జరుగుతోంది. రిలీజ్ కి ఇంకా 8 రోజులు ఉండగానే ఈ సినిమా ప్రీ సేల్స్ అక్కడ 2 మిలియన్ డాలర్స్ దాటిపోయింది. రిలీజ్‌కి ముందు ఓ సినిమా ఇంతలా బిజినెస్ చేయడం ఇదే తొలిసారి అని మూవీ టీమ్ చెబుతోంది. ఒకవేళ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే రూ.1000 కోట్ల వసూళ్లు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Kalki 2898AD

Also Read : ‘గేమ్ ఛేంజర్’ కు రామ్ చరణ్ గుడ్ బై..!

ఇదే విషయాన్ని తెలుపుతూ మూవీ టీమ్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. నార్త్ అమెరికాలో ఆల్ టైం ఫాస్టెస్ట్ 2 మిలియన్ ప్రీ సేల్స్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ మూవీ 'కల్కి' అంటూ పేర్కొన్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 27న ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు