Kalki 2898AD : వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో ప్రభాస్ 'కల్కి'.. ఆ జాబితాలో మొదటి స్థానం

'కల్కి 2898AD' మూవీ వరల్డ్ వైడ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చిన రెండు వారాల్లోనే 2.6 మిలియన్ల వ్యూస్‌, 7.5M గంటల టైమింగ్‌తో గ్లోబల్‌లో టాప్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లీష్‌ చిత్రాల జాబితాలో వరల్డ్‌ వైడ్‌గా మొదటి స్థానంలో కొనసాగుతోంది.

New Update
Kalki 2898AD : వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో ప్రభాస్ 'కల్కి'.. ఆ జాబితాలో మొదటి స్థానం

Kalki 2898AD Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898AD' ఇటీవల థియేటర్స్ లో రిలీజై సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

థియేటర్లలో నెల రోజులకు పైగా అలరించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్, సౌత్ లాంగ్వేజెస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇక  ఓటీటీ లోనూ ఈ మూవీ అదే హవాను కొనసాగిస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. 'కల్కి' స్ట్రీమింగ్‌కు వచ్చిన రెండు వారాల్లోనే అత్యధికంగా 2.6 మిలియన్ల వ్యూస్‌, 7.5M గంటల టైమింగ్‌తో గ్లోబల్‌లో టాప్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది.

Also Read : అలాంటి సినిమాలకు సెన్సార్‌ అవసరం లేదు.. కంగనాకు ‘కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడి సపోర్ట్

నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లీష్‌ చిత్రాల జాబితాలో వరల్డ్‌ వైడ్‌గా మొదటి స్థానంలో కొనసాగుతోంది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ తో పాటూ దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించారు.