Kalki 2898AD : ఓవర్సీస్ లో కొనసాగుతున్న 'కల్కి' హవా.. ప్రభాస్ దెబ్బకు షారుక్ రికార్డ్ గల్లంతు..!

ఓవర్సీస్ లో 'కల్కి' హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ మూవీ నార్త్ అమెరికాలో 18.5 మిలియన్‌ డాలర్లు వసూళ్లు చేసి షారుఖ్ ఖాన్ పఠాన్ (17.45,మిలియన్ డాలర్స్) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటించింది.

Kalki 2898AD : ఓవర్సీస్ లో కొనసాగుతున్న 'కల్కి' హవా.. ప్రభాస్ దెబ్బకు షారుక్ రికార్డ్ గల్లంతు..!
New Update

Kalki 2898AD Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లీడ్ రోల్స్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898AD'. జూన్ 27 న రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇండియాతో పాటూ ఓవర్సీస్ లోనూ కల్కి హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఈ మూవీ నార్త్ అమెరికాలో మరో మైలు రాయిని దాటింది.

పఠాన్ రికార్డును బ్రేక్ చేసిన 'కల్కి'

షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా అమెరికాలో రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధించింది. అయితే, తాజాగా కల్కి 2898 AD ఈ రికార్డును అధిగమించింది. 'కల్కి' ఇప్పటి వరకు 18.5 మిలియన్‌ డాలర్లు వసూళ్లు చేసి నార్త్‌ అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటించింది. గతంలో షారుక్‌ నటించిన ‘పఠాన్‌’ 17.45 మిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలోఉండగా.. తాజాగా ‘కల్కి’ దాన్ని అధిగమించింది.

Also Read : యాక్షన్, కామెడీ, గ్రాండ్ విజువల్స్ తో ‘జర్నీ ఆఫ్ విశ్వం’.. అంచనాలు పెంచేసిన మేకింగ్ వీడియో

కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే 'కల్కి' సినిమా 'పఠాన్' కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించడం విశేషం. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా విజయంతో ఎంతగానో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమాథియేటర్స్ లో ఇంకా ప్రదర్శితవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరింత కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. 'కల్కి' సెట్ చేసిన స్టాండర్డ్స్ ఇతర తెలుగు సినిమాలకు ప్రేరణగా నిలుస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

#prabhas #kalki-2898ad-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe