మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అవినీతి చిట్టా ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి బయట పెట్టారు. కాకినాడ ఎంఎస్ఎన్ గ్రౌండ్ విషయంలో మాజీ ఎమ్మెల్యే నాపై తప్పుడు ప్రచారంతో నాపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఎమ్‌ఎస్ఎన్ గ్రౌండ్ అభివృద్ధి చేయడం కోసమే మట్టితో ఫిల్లింగ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. డంపింగ్ యాడ్ చేస్తున్నారని.. లీజుకు ఇస్తూన్నారని.. మాజీ ఎమ్మెల్యే కొండబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. పూర్వ విద్యార్ధిగా నేను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నానని ద్వారంపూడి వెల్లడించారు. మీ జాతి నాయుడు సత్యలింగనాయకర్ పేరుపై నీవు ఏమి చేయలేదని ప్రశ్నించారు. నీవు చేసిన అక్రమాలపై జగన్‌కి ఎప్పుడో అవినీతి చిట్టా ఇవ్వటం జరిగిందని ఆరోపించారు. గతంలో నీవు.. నీ తోత్తులను పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డావు అని ఆరోపించారు. మీ తండ్రి వనమాడి లోవరాజు పేరుతో తప్పుడు పట్టా తెచ్చేందుకు ప్రయత్నాం చేస్తే అప్పట్లో పిల్లి సత్తిబాబు అడ్డుకున్నారని ఆయన గుర్తు చేశారు.
ఎమ్మెల్యే లాగా పనిచేయటం నా అదృష్టం
నీ అవినీతిపై బట్టలు విప్పి ఊరేగించే రోజు త్వరలో వస్తూందని తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే లాగా పనిచేయటం అనేది అదృష్టం, అభివృద్ధి చేసేందుకు మంచిపేరు కోసమే నేను కృషి చేస్తున్నానని ద్వారంపూడి తెలిపారు. కాకినాడలో అభివృద్ధి నేనేచేసాను, నీవు ఎమ్మెల్యేగా చేసినప్పుడు అవినీతికి పాల్పడ్డావనే ముద్ర నీవు సంపాదించుకున్నావు అని ఎద్దేవా చేశారు. ఏటి మొగప్రాంతంలో భూమిని కబ్జా చేసి కోర్టులో అడ్డుపడుతున్నావ్. ఆ భూమి ఏటిమొగ మత్స్యకారులకు హక్కు ఉందన్నారు. వాళ్ళుకు నీవు ఏమీచేయలేదని మండిపడ్డారు. డ్రైఫీస్ వ్యాపారం చేసే నీకు ఇంత ఆస్తులు ఎలా వచ్చాయి..? పెద్ద బిల్డింగ్‌లు ఎలా కట్టగలిగావ్..? అని ప్రశ్నించారు. టీడీపీ టిక్కెట్ నీకు వస్తుందో.. లేదో.. తెలియదు. జనసేనకు చంద్రబాబు ఇస్తాడో.. లేదో.. పవన్‌కే తెలియదన్నారు. నీకు టీడీపీ టిక్కెట్ రావాలి నాపై పోటీచేసి ఓడిపోవాలని నా ఇష్ట దైవం వెంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నానని ద్వారంపూడి తెలిపారు.
చంద్రబాబును మించిన ఘనుడు దేశంలోనే మరొకరు లేరు
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన ఘనుడు దేశంలోనే మరొకరు లేరన్నారు ద్వారంపూడి. అలాంటిది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేస్తోందంటూ.. నారా లోకేశ్ విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎద్దేవా చేశారు. ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబుకు ఇప్పుడు పరిస్థితులు కలిసి రాకపోవడంలేదనే అక్కసుతోనే లోకేశ్ ఈ రకమైన విమర్శలు చేస్తున్నారని ద్వారంపూడి మండిపడిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ రెండోసారి ప్రమాణస్వీకారం చేయడం ఖాయం అని దీమా వ్యక్తం చేశారు. అంతేకాదు టీడీపీ శాశ్వతంగా మూతపడడం జరుగుతుందని ద్వారంపూడి అన్నారు.
ఇది కూడా చదవండి: దేశంలో ఎక్కడా లేని చట్టాలు ఏపీలో ఉన్నాయి: బుద్దా వెంకన్న