/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-21T211350.601.jpg)
Kajal Agarwal Re Calls Shocking Incident : సినీ సెలబ్రిటీస్ (Cine Celebrities) కళ్ళ ముందు కనిపిస్తే కొందరు తమ అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఆ అభిమానం హద్దులు దాటుతూ ఉంటుంది. అది కాస్త సెలెబ్రెటీలకు ఇబ్బంది కలిగిస్తుంటుంది. మరో కొంతముందైతే కావాలనే సినీ తారలతో దురుసుగా ప్రవర్తిస్తుంటారు.
ఈ విషయం ఇప్పుడు డిస్కషన్ చేయడానికి రీజన్ ఏంటంటే, మన అందాల చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కి ఇలాంటి సంఘటనే ఒకటి ఎదురైందట. ఈ సంఘటన గురించి తన కొత్త సినిమా 'సత్యభామ' ప్రమోషన్స్ లో గుర్తు చేసుకుంది.
Also Read : అంచనాలు పెంచేసిన ‘ఇండియన్ 2’ ఫస్ట్ సింగిల్ ప్రోమో.. అదరగొట్టిన అనిరుద్!
పర్మిషన్ లేకుండా కారవాన్ లోకి వచ్చి, చొక్కా విప్పి..
" కొన్నేళ్ల కింద నేను ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్నా. ఫస్ట్ డే షూటింగ్ అయిపోయాక ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ పర్మిషన్ లేకుండా నా కారావాన్ లోకి వచ్చి తన చొక్కా విప్పి ఛాతిపై నా పేరుతో ఉన్న టాటూ (Tattoo) ను చూపించాడు. ఎవరూ లేని టైం లో అతను అలా చేసే సరికి నేను భయపడ్డా. నాపై తనకున్న అభిమానాన్ని టాటూ రూపంలో చుపించడం సంతోషమే.. కానీ సడెన్ గా వచ్చి అలా చేయడమే కరెక్ట్ కాదని హెచ్చరించా" అని చెప్పింది.
దీంతో కాజల్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా కాజల్ నటించిన సత్యభామ (Satyabhama) మూవీ ఈ నెల 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రైం థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో కాజల్ లేడీ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించింది. నవీన్ చంద్ర కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు.