/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/kadapa-3.jpg)
TDP MLA Madhavi Reddy : కడప (Kadapa) టీడీపీ (TDP) ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి (R Madhavi Reddy) RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజాత్ బాషాపై ఆర్ మాధవిరెడ్డి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంజాత్ బాషాపై గెలుపు సాధించడంతో కడప అసెంబ్లీకి తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Also Read: జాతీయ రహదారిపై రెచ్చిపోయిన దొంగలు.. ప్రయాణికులను కొట్టి..
ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. అంజాత్ బాషా ఇంత ఘోర ఓటమిని ఊహించి ఉండరని అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాత్ బాషా ఎన్నో అవమానాలకు గురిచేశారని.. అయినప్పటికి ప్రజలు తనను గుర్తించి భారీ మోజారిటీతో గెలిపించారని పేర్కొన్నారు. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి నైతికంగా విజయం సాధించినా భౌతికంగా పరాజయం చెందినట్టేనని అన్నారు.
20 సంవత్సరాల తర్వాత కడప నియోజకవర్గంలో ఒక మహిళగా విజయం సాధించి చరిత్ర సృష్టించానన్నారు. అంజద్ భాషా చేసిన వ్యాఖ్యలు వారి దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. 2024లో సాధించిన విజయస్ఫూర్తితో 2029లో పులివెందుల స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.