Kadapa : కౌంటింగ్ రోజు తోక జాడిస్తే.. తొక్క తీస్తా- కడప ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌

కౌంటింగ్‌ రోజున ఎవరైనా అనుచిత చర్యలకు పాల్పడినా, అల్లర్లు, ఘర్షణలు సృష్టించిన తోక జాడించాలని చూసినా..తోలు తీస్తామని కడప ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ అల్లరి మూకలు, రౌడీ రాజకీయ నాయకులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

New Update
Kadapa : కౌంటింగ్ రోజు తోక జాడిస్తే.. తొక్క తీస్తా- కడప ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌

AP : ఏపీలో సార్వత్రిక ఎన్నికలు (General Elections) మే 13న జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో, ఎన్నికలు ముగిసిన తరువాత పలు చోట్లు అల్లర్లు, ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కడప ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ అల్లరి మూకలు, రౌడీ రాజకీయ నాయకులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

కౌంటింగ్‌ రోజున ఎవరైనా అనుచిత చర్యలకు పాల్పడినా, అల్లర్లు, ఘర్షణలు సృష్టించిన తోక జాడించాలని చూసినా.. తోలు తీస్తామని ఆయన స్టైల్లో మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. రాజకీయ నేతల విమర్శలు పట్టించుకోమని పేర్కొన్నారు. సీఐని బెదిరించిన వారి భరతం పడతామని ఆయన గట్టిగా తేల్చి చెప్పారు.

కౌంటింగ్‌ డే (Counting Day) నాడు నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో భారీగా బలగాలను మోహరించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇప్పటికే పోలింగ్‌ (Polling) రోజు అల్లర్లు సృష్టించిన నిందితులను అరెస్ట్‌ చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. కౌంటింగ్‌ రోజు కూడా అల్లర్లకు పాల్పడితే వారి మీద నాన్‌ బెయిల్‌బుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. అలాగే నియోజకవర్గం లో కౌంటింగ్ ముగిసిన తరువాత ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదని ఎస్పీ కౌశల్‌ వివరించారు.

Also read: తెలంగాణ జూనియర్ డాక్టర్స్ సమ్మె వాయిదా…సానుకూలంగా స్పందించిన అధికారులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు