నేను గెలిస్తే విశాఖను దుబాయ్, సింగపూర్ లా చేస్తా: కేఏ పాల్

తాను విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నానని.. గెలిస్తే విశాఖను దుబాయ్ లా, సింగపూర్ లా మారుస్తానని పేర్కొన్నారు. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే జగన్, పవన్, చంద్రబాబు అడ్డుకోలేదని పాల్ దుయ్యబట్టారు. ఆంధ్ర ప్రదేశ్ ని చంద్రబాబు సర్వనాశనం చేశారన్నారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ వయస్సులో చిన్న కాబట్టి.. తమ్ముడు అంటానని చెప్పారు. పవన్ వారాహి యాత్ర, మోడీ యాత్ర, నారాహి యాత్ర.. వీటన్నింటినీ పవన్ రద్దు చేసుకోవాలని చెప్పారు. పవన్ కు ఓటు బ్యాంక్ లేదని, స్థిరత్వం కూడా లేదని..

KA Paul: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కేఏ పాల్ ఎన్నికల సాంగ్
New Update

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శనివారం విశాఖ పట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ, టీడీపీ, జనసేనలపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నానని.. గెలిస్తే విశాఖను దుబాయ్ లా, సింగపూర్ లా మారుస్తానని పేర్కొన్నారు. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే జగన్, పవన్, చంద్రబాబు అడ్డుకోలేదని పాల్ దుయ్యబట్టారు. ఆంధ్ర ప్రదేశ్ ని చంద్రబాబు సర్వనాశనం చేశారన్నారు.

పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ వయస్సులో చిన్న కాబట్టి.. తమ్ముడు అంటానని చెప్పారు. పవన్ వారాహి యాత్ర, మోడీ యాత్ర, నారాహి యాత్ర.. వీటన్నింటినీ పవన్ రద్దు చేసుకోవాలని చెప్పారు. పవన్ కు ఓటు బ్యాంక్ లేదని, స్థిరత్వం కూడా లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన మోడీ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. పార్టీలు మారి పవన్ దశావతారాలు ఎత్తుతున్నారని కేఏ పాల్ సెటైర్లు వేశారు.

పవన్ కళ్యాణ్ ని నాదేండ్ల మనోహర్ మిస్ గైడ్ చేస్తున్నారని అన్నారు కేఏ పాల్. లక్షలు, కోట్లు తెస్తాను.. జనసేనను మా పార్టీలో విలీనం చేయాలని అన్నారు. సీఎంగా వైఎస్ జగన్ ఫెయిల్ అయ్యారని, ఈసారి జగన్ పార్టీ కి 175 స్థానాలు కాదు.. పట్టుమని 25 సీట్లు కూడా రావని చెప్పారు.

ప్రతి ఇంటా...ప్రతి గుండెల్లో కేఏ పాల్ ఉంటారని చెప్పారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని.. నేను సీఎం అయితే ప్రతి నియోజకవర్గానికి హెలికాఫ్టర్ ఇస్తానని, ఆస్పత్రి కడతానని అన్నారు. అలాగే ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు పాల్. తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖకు ఎంపీ అవుతాను.. ఆ తర్వాత ప్రధాని అవుతానని పేర్కొన్నారు కేఏ పాల్.

కాగా మరోవైపు వైజాగ్ లోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు, టీఎన్ఎస్ఎఫ్ ఆందొళన చేశారు. కేఏ పాల్ మీడియా సమావేశం నిర్వహిస్తున్న క్రమంలో పాల్ కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు, టీఎన్ఎస్ఎఫ్ నేతలు నిరసనకు దిగారు. చంద్రబాబును, లోకేష్ ను కించపరిచే విధంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంపై ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్‌ను కూడా అవమానపరిచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేఏ పాల్ మతిస్థితితం కోల్పోయి మాట్లాడుతున్నారని, తక్షణమే చంద్రబాబు, పవన్ లకు క్షమాపణ చెప్పాలని లేదంటే ఊరుకునే ప్రసక్తే లేదని టీడీపీ నేతలు హెచ్చరించారు.

#pawan-kalyan #chandrababu #cm-jagan #ka-paul #serious-comments
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe