ఎన్నికల బరిలో KA పాల్.. తొలి జాబితా విడుదల! తెలంగాణ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత KA పాల్ తెలిపారు. ఇవాళ 12మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేశారు. రేపు రెండో జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. By V.J Reddy 06 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KA Paul Contesting In Elections: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో తాము కూడా పోటీ చేస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో 12మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఆయన ఇవాళ విడుదల చేశారు. గతంలో మునుగోడు ఉప ఎన్నికల్లో KA పాల్ పోటీ చేశారు. మునుగోడులో తనదైన ప్రచార శైలితో హల్‌చల్ చేసి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆకట్టుకున్నారు పాల్. అయితే, ఉపఎన్నికల్లో అతన్ని 805 ఓట్లకే పరిమితం చేశారు మునుగోడు ప్రజలు. తాజాగా మరోసారి తన సత్తా చాటేందుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పాల్ ప్రకటించారు. ALSO READ: కుదిరిన కాంగ్రెస్-సీపీఐ పొత్తు.. డీల్ ఇదే! KA పాల్ మాట్లాడుతూ.. "తెలంగాణ ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. 10ఏండ్లు అధికారంలో ఉండి కేసీఆర్(KCR) తెలంగాణ ప్రజలకు ఏమీ చేయలేదు. ప్రజాశాంతి పార్టీ తరఫున తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాదాపు 344 మంది టికెట్ కావాలని అప్లికేషన్ పెట్టారు. అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులకు తన పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది. రేపు రెండో జాబితా కూడా విడుదల చేస్తా. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తాను" అని అన్నారు. ALSO READ: బీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుంది: కేటీఆర్ ప్రజాశాంతి పార్టీ మొదటి లిస్ట్ అభ్యర్థులు వీరే: * చెన్నూరు- మొయ్య రాంబాబు * జుక్కల్ (ఎస్సీ) - కర్రోల్ల మోహన్ * రామగుండం - బంగారు కనకరాజు * వేములవాడ- అజ్మీరా రమేష్ బాబు * నర్సాపురం- సిరిపురం బాబు * జహీరాబాద్ - బేగరి దశరథ * గజ్వేల్- పాండు * ఉప్పల్ - కందూరు అనిల్ కుమార్ * యాకుత్ పురా- సిల్లివేరు నరేష్ * కల్వకుర్తి – కట్టా జంగయ్య * నకిరెకల్ -కదిర కిరణ్ కుమార్ * మధిర – కొప్పుల శ్రీనివాస్ రావు #ka-paul #first-list #telangana-elecions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి