Israel-Palestine: ఆగని ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. భారత్ వైఖరికి ఆ పార్టీ అసంతృప్తి..

ప్రధాని మోదీ బాధితులకు సానుభూతి తెలిపిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య నెలకొన్న సంక్షోభంపై భారత వ్యవహరిస్తున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలస్తీనా వాదాన్ని బలపరచడంతో సహా.. తమ హక్కుల కోసం వారు చేస్తున్నటువంటి పోరాటానికి భారత్‌గా మద్దతుగా నిలిచేదని వ్యాఖ్యానించారు.

Hamas-Israel War: ఇంకా కొనసాగుతున్న దాడులు.. గాజాలో 25 వేల మందికిపైగా మృతి
New Update

ఇజ్రాయెల్-పాలస్తీనియన్ ఉగ్రవాద సంస్థ హమాస్ మిలిటెంట్ల మధ్య నెలకొన్న సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధవాతావరణంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం గాజాలోని ఓ ఆసుపత్రిపై వైమానిక దాడి జరగడం సంచలనం రేపింది. ఈ దుర్ఘటనలో దాదాపు 500 మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడికి ఉగ్రమూకలే పాల్పడ్డాయని.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఆరోపించారు. అలాగే ఇజ్రాయెల్ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఆసుపత్రి దగ్గర్లోని పీఐజే మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్‌ గురితప్పండతో ఆసుపత్రిలో ఈ పేలుడు సంభవించిందని తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మేదీ కూడా స్పందించారు. ఆసుపత్రిలో ప్రాణనష్టం జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని.. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని తెలిపారు. అలాగే ఈ దాడిలో గాయపడిన వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని శిక్షించాలని కూడా ప్రధాని మోదీ అన్నారు. అయితే ఈ ప్రధాని మోదీ బాధితులకు సానుభూతి తెలిపిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య నెలకొన్న సంక్షోభంపై భారత వ్యవహరిస్తున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

పాలస్తీనా వాదాన్ని బలపరచడంతో సహా.. తమ హక్కుల కోసం వారు చేస్తున్నటువంటి పోరాటానికి భారత్‌గా మద్దతుగా నిలిచేదని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ కూడా ఏవైనా దాడులు, ప్రతిదాడులు విషయానికి వచ్చినట్లైతే వాటిని తీవ్రంగా ఖండించి ఉండేదని అన్నారు. కానీ దురదృష్టవశాత్తు.. ప్రస్తుతం భారత్ వ్యవహిరిస్తున్న వైఖరి మాత్రం యుద్ధానికి ముగింపు పలికేలా కనిపించడం లేదని అన్నారు. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై భారత్ తన వైఖరిని హుందాగా.. గౌరవప్రదమైన రీతిలో వెల్లడించాలని వేణుగోపాల్ అన్నారు. యుద్ధంలో సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం.. అలాగే గాజా ఆసుపత్రిపై జరిగిన దాడిలో వందల సంఖ్యలో పాలస్తీనియన్‌లు మరణించిన ఘటనను ఖండించాల్సిందేనని.. హమాస్ బృందాలు పాల్పడుతున్న దుశ్చర్యలు కూడా స్పందించలేనివని వేణుగోపాల్ అన్నారు. ఇలాంటి సమయాల్లో ఈ పరిస్థితులకు దారితీసిన చారిత్రక నేపథ్యాన్ని కూడా పరిశీలించడం ఎంతో ముఖ్యమని.. గాజాను పూర్తిగా నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ చేసే ప్రయత్నాలకు కొన్ని దేశాలు తమ మద్దతును తెలపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ లేదా పాకిస్థాన్‌.. రెండు దేశాలూ కూడా అంతర్జాతీయ మానవతా చట్టాలకు లోబడి ఉండాలని కేసీ వేణుగోపాల్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

#israel-hamas-war #hamas-vs-israel #israel-palestine-conflict
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe