అదుపు తప్పిన నాటు పడవ..పెద్ద ప్రమాదమే తప్పింది! కొల్లేరులోకి ఒక్కసారిగా వరద ప్రవాహం రావడంతో కూలీలతో వెళ్తున్న నాటు పడవ ఒకటి అదుపు తప్పింది. అందులో సుమారు 25 మంది కూలీలు ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే...వరద నీరు ఒక్కసారిగా కొల్లేట్లోకి రావడంతో వరద ఉద్ధృతి పెరిగింది. By Bhavana 29 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అనేక గ్రామాలు నీట మునిగాయి. కొన్ని గ్రామాల్లోని ప్రజలు కట్టుబట్టలతో మిగిలారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా గ్రామాలు నీట మునిగాయి. లంక గ్రామాలు పూర్తిగా నీట మునిగి పక్క గ్రామాల వారితో సంబంధాలు లేకుండా ఉన్నాయి. ఈ క్రమంలోనే కైకలూరు మండలం కొల్లేరులో శుక్రవారం ఓ ఘోర ప్రమాదం తప్పింది. కొల్లేరులోకి ఒక్కసారిగా వరద ప్రవాహం రావడంతో కూలీలతో వెళ్తున్న నాటు పడవ ఒకటి అదుపు తప్పింది. అందులో సుమారు 25 మంది కూలీలు ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే...వరద నీరు ఒక్కసారిగా కొల్లేట్లోకి రావడంతో వరద ఉద్ధృతి పెరిగింది. దాంతో కోమటిలంక రోడ్డు మార్గం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే కైకలూరు మండలంలోని గుమ్మళ్లపాడు, కొల్లేటికోట, ఆకివీడు, జంగంపాడు గ్రామాలకు చెందిన సుమారు 25 మంది కూలీలు చేపల పట్టుబడి కోసం శుక్రవారం ఉదయం కోమటి లంక గ్రామానికి వెళ్లారు. సాయంత్రం పట్టుబడి పూర్తి అయిన తరువాత తిరిగి 25 మంది కూలీలు ఓ నాటు పడవలో బయల్దేరారు. ఆ సమయంలో పడవ ఒక్కసారిగా అదుపు తప్పింది. సామర్థ్యానికి మించి జనం పడవలో ఎక్కడం వల్ల నాటు పడవ అదుపు తప్పింది. పడవ బోల్తా పడుతుందనుకున్న అందులోని సుమారు 10 మంది యువకులు నీటిలోకి దూకేశారు. దీంతో పడవలో కొంచెం బరువు తగ్గి..అలా సుమారు ఓ అరకిలోమీటరు మేర వెళ్లింది. అనంతరం పరిస్థితి కొంచెం అనుకూలించి పడవ అదుపులోనికి వచ్చింది. దీంతో మిగిలిన కూలీలు పడవను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. #andhrapradesh #eluru #boat #kolleru మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి