Devara : 'దేవర' సెకండ్ సింగిల్ అప్డేట్.. లవర్ బాయ్ గా ఎన్టీఆర్, జాన్వీతో అదిరిపోయే డ్యూయెట్..! 'దేవర'మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా రెండో సింగిల్ ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు తారక్, జాన్వీల రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సెకండ్ సింగిల్ రొమాంటిక్ మెలోడీగా ఉండబోతుంది. By Anil Kumar 02 Aug 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Devara Second Single : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర'. కొరటాల శివ (Koratala Siva) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ లో విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అవ్వడంతో సెకండ్ సింగిల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ కంపోజిషన్ లో రానున్న ఈ సాంగ్స్ కోసం తారక్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మేకర్స్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, 'దేవర' రెండో సింగిల్ ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓఫీషియల్గా ప్రకటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ మాస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకోగా.. సెకండ్ సింగిల్ రొమాంటిక్ మెలోడీగా ఉండబోతుంది. దీనికి సంకేతంగా తారక్, జాన్వీల రొమాంటిక్ పోస్టర్ ఒకటి వదిలారు. Time for hearts to go full ❤️🔥 The most awaited #DevaraSecondSingle arriving on August 5th 🌊💕#DevaraonSep27th#Devara Man of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril @sreekar_prasad @Yugandhart_ @YuvasudhaArts… pic.twitter.com/aJXGD3uqUB — NTR Arts (@NTRArtsOfficial) August 2, 2024 Also Read : ‘ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు’.. బిగ్ బాస్ సీజన్-8 టీజర్ చూశారా? ఇందులో తారక్ స్టైలిష్ అండ్ రెఫ్రెషింగ్ లుక్ లో లవర్ బాయ్ గా కనిపించాడు. కాగా.. తంగం అంతరంగం అంటూ ఈ పాట సాగనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న 'దేవర' పార్ట్-1 సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది. #koratala-siva #devara-second-single #devara-movie #ntr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి