BRS : హరీష్ రావుకు షాక్..పీఏతో పాటూ మరో ముగ్గురని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు తగిలింది. ఈయన కార్యాలయ సిబ్బంది నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి నాయక్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధానంగా వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
MLA Harish Rao: పవర్‌ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారు.. హరీష్ రావు ఫైర్

Harish Rao : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నేతలకు వరుసగా షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఇప్పటి వరకు ఆపార్టీ నేతలకు మింగుడుపడడం లేదు. ఇప్పుడు దానికి తోడు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల వ్యవహారంలో (BRS Leader) మాజీ మంత్రి హరీష్ రావు షాక్ ఇచ్చారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ చెక్కులను దుర్వినియోగం చేశారంటూ నారాయణ్ ఖేడ్‌కు చెందిన రవి నాయక్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీష్ రావు కార్యాలయ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  తనకు చేరాల్సిన  CMRF చెక్కులను కాజేశారని రవి నాయక్(Ravi Naik) ఆరోపిస్తున్నారు. మొత్తం 5లక్షల చెక్కులను ఎన్ క్యాష్ చేసుకున్నారని చెబుతున్నారు. దీని మీద పోలీసులు ప్హరాథమిక విచారణ జరిపిన తరువాతనే హరీశ్ రావు కార్యాలయ సిబ్బందిని  రావు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హరీశ్‌షావు పీఏ నరేశ్‌ కుమార్‌తో పాటూ కొర్లపాటి వంశీ, వెంకటేశ్‌ గౌడ్, ఓంకార్ ఉన్నారు.  వీరందరూ CRMF వింగ్‌లో పని చేశారు.  వీరి దగ్గర మరికొన్ని CRMF చెక్కులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Also Read : తెలంగాణలో తగ్గనున్న జిల్లాలు.. రేవంత్ సర్కార్ ఆలోచన ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు