Ayodhya : అయోధ్య వేడుకకు రాని జూ.ఎన్టీయార్ మరికొందరు...

అయోధ్యలో బాలరాముడు కొలువయ్యాడు. దేశమంతా ఈ వేడుకను అత్యంత ఆనందంగా వీక్సించింది. చాలా మంది ప్రముఖులు ఈ మహోత్సవానికి హాజరయ్యారు. కానీ టాలీవుడ్‌లో ఆహ్వానాలు అందినా జూ.ఎన్టీయార్ మరికొంత మంది దీని హాజరవ్వలేదు.

Ayodhya : అయోధ్య వేడుకకు రాని జూ.ఎన్టీయార్ మరికొందరు...
New Update

Tollywood Celebrities : అయోధ్య(Ayodhya) లో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభోగంగా జరిగింది. ప్రధాని మోడీ(PM Modi) చేతుల మీదుగా బాలరాముడు కొలువయ్యాడు. ఆ తర్వాత బాలరామునికి ప్రధాని ప్రత్యేక పూజలు కూడా చేశారు. దాదాపు గంటసేపు పాటూ గర్బాలయంలో మోడీ పూజలు నిర్వమించారు. ప్రధానితో పాటూ ఆర్ఎస్ఎస్(RSS) ఛీఫ్ మోహన్ భగవత్, ఉత్తప్రదేశ్(Uttar Pradesh) సీఎం యోగి ఆదిత్యానాథ్‌(CM Yogi Adityanath)లు కూడా రామ్‌ లల్లా(Ram Lalla) కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకకు దేశంలోని అత్యంత ప్రముఖులు విచ్చేశారు. దాదాపు 7వేల మంది విశిష్ట అతిధులు వచ్చారు. రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, స్వామీజీలు అయోధ్యకు తరలివచ్చారు.

Also Read : నేరవేరిన ఏళ్ళ కల..అయోధ్యలో కొలువైన బాలరాముడు

అయోధ్యకు వెళ్ళని బాలరాముడు..

బాలరాముడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్న జూ.ఎన్టీయారే(Jr. NTR) అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ట మహోత్సవానికి హాజరు కాలేదు. ఆహ్వానం అందినా వేడుకకు డుమ్ము కొట్టాడు. దేవర(Devara) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీయార్ అయోధ్య ప్రారంభ మహోత్సవానికి హాజరవ్వలేకపోయాడు. ఆహ్వానం అందినప్పటికీ షూటింగ్‌ను ఆపేఛాన్స్ లేకపోవడంతో వెళ్ళలేకపోయాడు. మరో మూడు నెలల్లో దేవర సినిమా రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో నటిస్తున్న తారాగణం అంతా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు.

మెగా కుటుంబం మాత్రమే...

అయోధ్య సంబరాలకు టాలీవుడ్ నుంచి కేవలం మెగా కుటుంబం మాత్రమే హాజరయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్,పవన్ కల్యాణ్‌లు శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు హాజరయ్యారు. టాలీవుడ్‌లో ఇంకా ప్రబాస్, అల్లు అర్జున్, డైరెక్టర్ రాజమౌళి, మోహన్ బాబు లాంటి వాళ్ళకు కూడా ఆహ్వానాలు అందతాయి. కానీ వీరెవ్వరూ కూడా అయోధ్య వేడుకకు వెళ్ళలేదు. అల్లు అర్జున్ పుష్ప2, ప్రభాస్ సలార్, కల్కి షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ కారణం చేతనే వారు కూడా వెళ్ళలేకపోయారని తెలుస్తోంది.

భయం వల్లనే వెళ్లలేదు..

మరోవైపు అయోధ్యకు రావాలని మంచు కుటుంబానికి కూడా ఆహ్వానం అందింది అని స్వయంగా మోమన్ బాబే ప్రకటించారు. మ కుటుంబానికి కూడా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ ఆహ్వానం అందిందని...సెక్యూరిటీ కూడా కల్పిస్తామని తెలియజేశారు. కానీ భద్రతా కారణాల వల్ల రాలేకపోతున్నానని, తనను క్షమించమని లేఖ రాశానని మోహన్ బాబు చెప్పారు.

Also Read : నేరవేరిన ఏళ్ళ కల.. అయోధ్యలో కొలువైన బాలరాముడు

#tollywood #movie-stars #ayodhya #ram-mandir #ram-lalla #jr-ntr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe