Prakash Raj: ప్రకాష్ రాజ్ కు షాక్... చంద్రయాన్-3 పై కామెంట్స్ చేసినందుకు కేసు....!

చంద్రయాన్‌ 3 మీద ట్వీట్‌ చేసి ట్రోలింగ్‌ కు గురయ్యారు నటుడు ప్రకాశ్‌ రాజ్‌. రెండు రోజుల నుంచి ఆయనను నెటిజన్లు ఏకిపారేస్తున్నప్పటికీ ఆయన మాత్రం తగ్గేదేలే అంటూ ఇంకా రెచ్చిపోతున్నారు. తన మీద వచ్చిన ట్రోలింగ్స్‌ కు గట్టిగా సమాధానం చెబుతున్నారు.

New Update
Prakash Raj: ప్రకాష్ రాజ్ కు షాక్... చంద్రయాన్-3 పై కామెంట్స్ చేసినందుకు కేసు....!

Prakash Raj Defends Chandrayaan 3 Post:

సినీ నటుడు ప్రకాష్ రాజ్ కు షాక్ తగిలింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 పై కామెంట్స్ చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. చంద్రయాన్-3ను ఆయన హేళన చేశారంటూ కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో కర్ణాటకలోని బాగ్లా కోట్ పోలీసులు ప్రకాష్ రాజ్ పై కేసు నమోదు చేశారు. హిందూ సంఘాల నేతలు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

చంద్రయాన్‌ 3 మీద ట్వీట్‌ చేసి ట్రోలింగ్‌ కు గురయ్యారు నటుడు ప్రకాశ్‌ రాజ్‌. రెండు రోజుల నుంచి ఆయనను నెటిజన్లు ఏకిపారేస్తున్నప్పటికీ ఆయన మాత్రం తగ్గేదేలే అంటూ ఇంకా రెచ్చిపోతున్నారు. తన మీద వచ్చిన ట్రోలింగ్స్‌ కు గట్టిగా సమాధానం చెబుతున్నారు.

యావత్‌ ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చంద్రయాన్‌3 గురించి సినీ నటుడు, రాజకీయ నేత అయినటువంటి ప్రకాశ్‌ రాజ్‌ ట్విటర్ వేదికగా ఒక కార్టూన్ తో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో నెటిజన్లు కూడా ఆయనను ఓ రేంజ్‌ లో ఆడేసుకున్నారు.

ఆయన పెట్టిన ట్వీట్‌ ఏంటంటే ఒక ఛాయ్ వాలా పిక్‌ పెట్టి..చంద్రయాన్‌ 3 (Chandrayaan-3) పంపిన మొట్టమొదటి చిత్రం ఇదే..వావ్‌ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు ఆయనను ఒక రాజకీయ విద్వేషిగా మారారు అంటూ ఏకిపారేశారు. అంతేకాకుండా ఆ చిత్రం ప్రధాని మోడీని ఉద్దేశించి పెట్టిందని చీవాట్లు కూడా వేశారు.

మీ దృష్టి అంతా రాజకీయ విద్వేషంతో నిండిపోయింది. దాని నుంచి బయటకు వచ్చిన రోజు అంతా మంచిగా ఉంటుంది. యావత్‌ ప్రపంచం గర్వించదగిన చంద్రయాన్‌ 3 గురించి ఇలా మాట్లాడటం తగదని ఆయనకు బుద్ధి చెప్పారు.

అయితే తాజాగా ఆ ట్రోలింగ్స్‌ గురించి ప్రకాశ్‌ రాజ్‌ స్పందించారు. మరో ట్వీట్‌ ద్వారా వాటికి సమాధానం చెప్పారు. ‘విద్వేషం.. విద్వేషాన్ని మాత్రమే చూస్తుంది’ అని పేర్కొంటూ తన గత ట్వీట్‌కు వివరణ ఇచ్చారు. నేను ఓ పాత జోక్‌ ని గుర్తు చేస్తూ పెడితే..దానిని కూడా రాజకీయం చేస్తున్నారు అని పేర్కొన్నారు.

తాను కేరళ చాయ్‌వాలాపై పోస్టు షేర్ చేశానని, మరి ట్రోల్స్ చేసిన చాయ్‌వాలా ఎవరు? అని పరోక్షంగా మోడీని ఉద్దేశించి సెటైర్ వేశారు. జోక్‌ను అర్థం చేసుకోలేనివారు అది తమపైనే అని అనుకుంటారని ఘాటుగా బదులిచ్చారు. కాస్త ఎదగండయ్యా.. అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు.

Also Read: బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ..!!

#trolling #prakash-raj-defends-chandrayaan-3-post #counter #twitter #prakash-raj #chandrayan-3
Advertisment
తాజా కథనాలు