Israel-Hamas: ఆగని భీకర యుద్ధం.. మానవతా సంక్షోభం నివారణకై అమెరికా ప్రయత్నాలు

ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజుల నుంచి గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తూ విరుచుకుపడుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు 5 వేల రాకెట్లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై వరుసగా బాంబుల వర్షం కురిపిస్తోంది.

Israel-Hamas: ఆగని భీకర యుద్ధం.. మానవతా సంక్షోభం నివారణకై అమెరికా ప్రయత్నాలు
New Update

ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజుల నుంచి గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తూ విరుచుకుపడుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు 5 వేల రాకెట్లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై వరుసగా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల వల్ల ఇప్పటికవరకు ఇజ్రాయెల్‌లో 1300 మందికి పైగా మృతి చెందగా.. గాజాలో దాదాపు 199 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్-పాలస్తీన్‌ల మధ్య జరుగుతున్న ఈ యుద్ధ వాతరవరణానికి ఎప్పుడు ముగింపు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవలే తమ దేశంలోని నిరిమ్ ప్రాంతంలో జరిగిన మరణకాండకు బాధ్యుడైనటువంటి హమాస్ కీలక కమాండర్ బిలాల్ అల్ కేద్రాను అంతం చేసినట్లు ఇజ్రాయెల్ వాయుసేన ప్రకటించింది. ప్రస్తుతం గాజాలో సంక్షోభం నెలకొన్న వేళ.. అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ముందడుగు వేశారు. అటూ ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు.. అలాగే పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌తో చర్చించారు.

గాజాకు మానవతా సాయాన్ని కొనసాగించేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ బైడెన్ కోరారు. సామన్య పౌరులను రక్షించడానికి కొనసాగే చర్యలకు తన పూర్తి మద్ధతు ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు అమెరికా.. ఇజ్రాయెల్‌కు మద్దతుగా యూఎస్‌ఎస్‌ డ్వైట్‌ డి. ఐసన్‌హోవర్‌ అనే క్యారియర్‌ స్ట్రైక్‌ గ్రూప్‌ను అక్కడికి పంపించింది. ఇప్పటికే తూర్పు మధ్యధరా సముద్రంలో ఇజ్రాయెల్‌కు మద్ధతుగా యూఎస్‌ఎస్‌ జెరాల్డ్‌ ఆర్‌.ఫోర్డ్‌ క్యారియర్‌ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఈ సంక్షోభాన్ని నివారించేందుకు పశ్చిమాసియా దేశాలతో దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ యుద్ధం మరింతగా విస్తరించకుండా ఆపేందుకు వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్నారు. అలాగే సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్‌ ఫైసల్‌ బిన్‌ ఫర్హాన్‌తో పాటు యుఏఈ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా చర్చలు జరిపారు. ఈ భీకర పోరులో చిక్కుకున్నటువంటి సామాన్యుల పౌరులను మానవతా సంక్షోభం నుంచి కాపాడేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నారు.

ఇదిలా ఉండగా.. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ కూడా ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలెంట్‌తో మాట్లాడారు. సామాన్యులను కాపాడాల్సిన ఆవశ్యకతపై ఆయన చర్చలు జరిపారు. పౌరుల జీవితాలు ప్రమాదంలో పడటం.. అలాగే ఈ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆందోళన కొనసాగుతోంది. అమెరికా విస్తృత జరుపుతున్న సంప్రదింపులు కూడా దాన్నే ప్రతిబింబిస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత బైడెన్‌ ఇప్పటికే పలుసార్లు నెతన్యాహుతో మాట్లాడారు. కానీ, పాలస్తీనా అధ్యక్షుడితో చర్చించడం మాత్రం ఇదే మొదటిసారి. గాజాలోని పాలస్తీనా ప్రజలకు సాయం అందించడానికి చేపడుతున్న చర్యలను బైడెన్‌కు అబ్బాస్‌ ఈ సందర్భంగా వివరించినట్లు తెలుస్తోంది.

#israel-attack #gaza #hamas-vs-israel
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe