America : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తనకు ఆత్మహత్య(Suicide) చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని.. ఓ బ్రిడ్జిపై నుంచి దూకాలని అనుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. '1972లో నేను తొలిసారి సెనేటర్‌గా గెలిచిన తర్వాత.. కొన్ని రోజులకు నా భార్య నీలియా, 18 నెలల బాబు రోడ్డు ప్రమాదం(Road Accident) లో దూరమయ్యారు. ఈ సమయంలో నేను చాలా బాధలో ఉన్నాను. ఆ బాధలో మందు తాగడం అలావాటు లేని నాకు.. మందు బాటిల్ తీసుకొని డెలావేర్ మెమోరియల్ బ్రిడ్జి వద్దకు వెళ్లి తాగాను. అలా తాగుతుండగా ఆ బ్రిడ్జి నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది. కానీ నాతో ఉన్న పిల్లల గురించి ఆలోచించి.. సూసైడ్ చేసుకోవాలనుకున్న నిర్ణయాన్ని విరమించుకున్నాను.
Also Read: ఎలక్ట్రికల్ కార్లకు చైనాలో 2000 డాలర్లు ధర తగ్గించేసిన టెస్లా!
కష్టాలు వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలన్న పిచ్చి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని' బైడెన్ అన్నారు. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) గురించి మాట్లాడూతూ.. ఎన్నికలకు ముందే తాను డిబేట్‌లో పాల్గొనాలి ఉన్నట్లు చెప్పారు. ఏ చోటైన ట్రంప్‌తో డిబేట్ చేయడం సంతోషమేనన్నారు. మరోవైపు బైడెన్ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. తాను కూడా సిద్ధంగా ఉన్నానని.. ఎప్పుడైనా ఏ సమయానికైనా బైడెన్‌తో డిబేట్‌కు అంగీకరిస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇదిలాఉండగా.. అమెరికాలో నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష పదవి ఎన్నికల డిబేట్ల తేదీల వివరాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 16న టెక్సాస్‌లోని శాన్ మార్కోస్, అక్టోబర్ 1న వర్జీనియాలోని పీటర్స్‌బర్గ్, అక్టోబర్ 9న స్టాల్ లేక్ సిటీలో జరగనున్నాయి.
Also Read: ఇదొక అంతుచిక్కని మిస్టరీ!అక్కడి కి వెళ్లాలంటేనే వణికిపోతారు..అదే హంటర్ ఐలాండ్స్!