Indian Post Recruitment 2024: ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ లో ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటున్న యువతకు గుడ్ న్యూస్. స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంమైంది. ఆఫ్‌లైన్ మోడ్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 27 స్టాఫ్ కార్ డ్రైవర్ ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ ఖాళీలన్నీ కర్ణాటక ప్రాంతానికి చెందినవి. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. అప్లయ్ చేసుకోడానికి చివరి తేదీ మే 14, 2024. అయితే ఈ పోస్టులకు అప్లయ్ చేసేముందు ఇక్కడ కింద ఇచ్చిన వివరాలను జాగ్రత్తగా చదవండి.
విద్యార్హత, వయోపరిమితి
అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై (10th Pass) ఉండాలి. అలాగే, దరఖాస్తుదారుడి వయస్సు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు 40 సంవత్సరాల వయస్సు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు). మాజీ సైనికులకు వయోపరిమితిలో 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. SC లేదా ST వర్గానికి చెందినవారైతే 8 సంవత్సరాల సడలింపు,OBC వారికి 6 సంవత్సరాల సడలింపు లభిస్తుంది.
Also Read: పాక్ నటితో ఇండియన్ సింగర్ లవ్ ట్రాక్.. ఫొటోస్ వైరల్!
ఎంత జీతం
ఇండియా పోస్ట్‌లో డ్రైవర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ.19,900 నుండి రూ.63,200 వరకు జీతం ఇవ్వబడుతుంది. ఈ జీతం 7వ పే కమిషన్ యొక్క పే లెవెల్ 2 ప్రకారం ఇవ్వబడుతుంది. దీంతో పాటు ఎంపికైన అభ్యర్థులకు ఇతర సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.
ఎంపిక ప్రక్రియ
దరఖాస్తుదారు థియరీ టెస్ట్/డ్రైవింగ్ టెస్ట్, మోటార్ మెకానిజం టెస్ట్‌కు హాజరు కావాలి. డ్రైవింగ్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులకు మాత్రమే పోస్టింగ్ ఇవ్వబడుతుంది . ఎంపికైన అభ్యర్థికి 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ నిర్ణయించబడింది.