AP Child Welfare Department Jobs : ఏపీ ప్రభుత్వం(AP Government) తమ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు వరుస తీపి కబుర్లు అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు కాంట్రాక్ట్ విధానంలోనూ చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. వ్యవసాయ, వైద్య, విద్య రంగాల్లోనూ పలు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నెల్లూరులోని జిల్లా మహిళా శిశు సంక్షేమ(AP Child Welfare Department Jobs), సాధికారత అధికారి కార్యాలయంలో కాంట్రక్ట్ విధానం ప్రతిపాదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరింది. ఆసక్తిగల అభ్యర్థులు కింద సూచించిన విధంగా అప్లై చేసుకోవాలి.
పూర్తిగా చదవండి..AP: ఏపీ శిశు సంక్షేమ శాఖలో జాబ్స్.. ఈ రెండు అర్హతలుంటే చాలు
నెల్లూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం కాంట్రక్ట్ విధానం ప్రతిపాదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనుండగా డిగ్రీ, పీజీతోపాటు సంబంధిత శాఖలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. అప్లికేషన్ కు డిసెంబర్ 23 లాస్ట్ డేట్.
Translate this News: