Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ECIL ఉద్యోగ నోటిఫికేషన్!

ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈసీఐఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. 30 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మార్చి 23నుంచి ఏప్రిల్‌ 13 వరకూ ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించింది.

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ECIL ఉద్యోగ నోటిఫికేషన్!
New Update

ECIL Recruitment 2024: ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి హైదరాబాద్ లోని ఈసీఐఎల్ (ECIL) శుభవార్త చెప్పింది. తమ సంస్థలోని పలు ఖాళీల భర్తీ చేసేందుకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌తో పాటు పలు జోనల్‌ కార్యాలయాలు, ప్రాజెక్టు సైట్‌లలో పనిచేసేందుకు 30 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.

మొత్తంగా 30 పోస్టులు భర్తీ చేస్తుండగా ఈసీఈలో 5, ఈఈఈ 7, మెకానికల్‌ 13, సీఎస్‌ఈ 5 చొప్పున ఉన్నాయి.

దరఖాస్తు తేదీ..
మార్చి 23నుంచి ఏప్రిల్‌ 13 మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగనుంది.

అర్హతలు..
సంబంధిత విభాగంలో మొదటి శ్రేణిలో ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు ఫీజు:
జనరల్‌ అభ్యర్థులు/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1000 చొప్పున చెల్లించాలి.

వయో పరిమితి:
2024 ఏప్రిల్‌ 13 నాటికి అభ్యర్థుల వయస్సు 27ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ల ఆధారంగా ఆయా వర్గాలకు వయో సడలింపు ఉంది.

ఎంపిక విధానం:
రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీలో మాత్రమే ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ రూపంలో రాత పరీక్ష ఉంటుంది. తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. హాల్‌టిక్కెట్లు, పరీక్ష తేదీలకు సంబంధించిన వివరాలను ఆ తర్వాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబయి/నాగ్‌పుర్‌, దిల్లీ/నోయిడా, కోల్‌కతా

ముఖ్య గమనిక:
ఉద్యోగాలకు ఎంపికైన వారు నాలుగేళ్ల పాటు కంపెనీలో పనిచేస్తామని బాండ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే రూ.4లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.40,000 - రూ.1,40,000 వరకు వేతనం అందుతుంది.

Notification PDF

Apply Online

#hyderabad #jobs #ecil #ecil-recruitment-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe