జాబ్స్ SBI PO Hall Tickets: స్టేట్ బ్యాంక్ పీఓ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్ల విడుదలపై కీలక అప్టేట్..!! ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బిఐలో పీవో పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల అలర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రొబేషనరీ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష కోసం వచ్చే వారం అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేయనుంది. అడ్మిట్ కార్డు విడుదలైన వెంటనే.. అభ్యర్థులు SBI PO అడ్మిట్ కార్డ్‌లను sbi.co.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. By Bhoomi 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Constable Training: కానిస్టేబుల్ ఉద్యోగం పొందిన అభ్యర్థులకు అలర్ట్.. ట్రైనింగ్ మరింత ఆలస్యం? తెలంగాణలో కానిస్టేబుల్ అభ్యర్థులకు బీఅర్ట్. ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తయ్యింది. ఈ నేపథ్యంతో తర్వాతి అంకంపై టీఎస్ఎల్ పిఆర్ బి ఫోకస్ పెట్టింది. ఉద్యోగాలకు సెలక్ట్ అయిన అభ్యర్థుల ప్రవర్తన, పూర్వాపరాల పరిశీలనతోపాటు వైద్యపరీక్షలు జరగాల్సి ఉంది. అయితే సెలక్ట్ అయిన అభ్యర్థులు ముందుగానే ధ్రువీకరణపత్రాలపై గెజిటెడ్ అధికారుల సంతకాలతో కూడిన అటెస్టేషన్ పత్రాలను అక్టోబర్ 13లోగా సమర్పించాలి. ఈ ప్రక్రియ అంతా కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసు పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ ప్రక్రియన త్వరగా చేపడితే నవంబర్ 20వ తేదీ వరకు కొసాగనుంది. ఆలోపు పూర్తకానట్లయితే ట్రైనింగ్ మరింత ఆలస్యం కానుంది. ఎందుకంటే తెలంగాణలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లయితే..ఈ ప్రక్రియను నిలిపివేసే అవకాశం ఉంటుంది. By Bhoomi 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Job Mela in Telangana: తెలంగాణలో భారీ జాబ్ మేళా.. 70 కంపెనీల్లో 2500+ జాబ్స్.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే! నిరుద్యోగులకు శుభవార్త. అక్టోబర్ 9న మహబూబాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. సూర్య చంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. అక్టోబర్ 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఈ జాబ్ మేళా కొనసాగుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ ఉదయం 9గంటల మహబూబాబాద్ న్యూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు అన్ని ధ్రువపత్రాలతో హాజరు కావాలని తెలిపారు. By Bhoomi 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs : నిరుద్యోగులకు అలర్ట్..ఆ శాఖలో 339 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..!! తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది జెన్కో. తెలంగాణ జెన్ కోలో మొత్తం 339 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎలక్ట్రికల్ మెకానికల్, ఇంజనీరింగ్, సివిల్ విభాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలి?..చివరి తేదీ ఎప్పుడు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Bhoomi 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SBI Jobs: రూ.63వేల శాలరీతో ఎస్బీఐ జాబ్స్.. అప్లికేషన్‌కి గడువు పొడిగింపు..! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా www.sbi.co.in అధికారిక వెబ్సైట్లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 439 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు డేట్‌ని అక్టోబర్ 21వరకు పొడిగించారు. అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్లతో సహా వివిధ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. By Trinath 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Scholarship: నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్‌లో దరఖాస్తులు ప్రారంభం..అర్హులు ఎవరంటే? 'నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్' (NMMSS 2024) కోసం నమోదు ప్రక్రియను విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అభ్యర్థులు నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్ Scholarship.gov.in యొక్క అధికారిక సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. By Bhoomi 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ World Teacher's day: ఆన్లైన్ ట్యూటర్లకు భారీ డిమాండ్.. మీరు కూడా ఇలా డబ్బులు సంపాదించుకోవచ్చు..! రేపు(అక్టోబర్ 5) ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. టీచర్లంటే కేవలం స్కూల్స్, కాలేజీల్లో బోధించేవారే కాదు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆన్లైన్ టీచింగ్ ట్రెండ్ నడుస్తోంది. పార్ట్‌టైమ్‌గా ఆన్లైన్ ట్యూటర్ సైట్స్‌లో టీచింగ్ చేస్తు డబ్బులు సంపాదించుకోవచ్చు. ట్యూటర్ విస్టా, చెగ్గ్, వేదాంతూ, వీఐపీ కిడ్, ట్యూటర్ ఎంఈ వెబ్సైట్లు ఆన్లైన్ ట్యూటరింగ్కి కొన్ని బెస్ట్ ఫ్లాట్‌ఫామ్స్! By Trinath 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana Police Constable Results: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అప్డేట్.. ఫలితాలు ఎప్పుడంటే.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ రిజల్ట్స్ విడుదలయ్యే సమయం ఆసన్నమైంది. రిజల్ట్స్‌కి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది టీఎస్ఎల్పీఆర్బి. గురువారం ఉదయం కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. By Shiva.K 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ World Teacher's day: గౌరవం ఉంది.. జీతాలే లేవు.. ఇండియాలో టీచర్ల శాలరీలు ఇంత తక్కువా? ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఏటా అక్టోబర్ 5న వస్తుంది. విద్యార్థి దశ నుంచే జ్ఞానంతో పాటు జీవితంలో వెలుగులు నింపే టీచర్‌కు ఇండియాలో శాలరీలు చాలా తక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. చాలా మంది భారతీయ ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ లేకుండానే పనిచేస్తుండగా.. వారి జీతం నెలకు సగటున రూ.10వేలు మాత్రమేనని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. By Trinath 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn