Telangana : తెలంగాణ టెట్ దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్!
తెలంగాణ టెట్ ఆన్ లైన్ అప్లికేషన్లు శనివారంతో ముగియనున్నాయి. అర్హత గల అభ్యర్థులు ఇప్పటి వరకు అప్లై చేసుకోని వారు ఎవరైనా ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ టెట్ ఆన్ లైన్ అప్లికేషన్లు శనివారంతో ముగియనున్నాయి. అర్హత గల అభ్యర్థులు ఇప్పటి వరకు అప్లై చేసుకోని వారు ఎవరైనా ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆర్థిక భారం తగ్గించుకోవడం కోసం ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తూ.. ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. 23 ఏళ్ల చరిత్రలో తొలిసారి కంపెనీ నుంచి సుమారు 26 వేల మంది ఉద్యోగులు వెళ్లిపోయారు.
మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణను గడువు పొడిగించారు. అభ్యర్థులు ఏప్రిల్ 23 వ తేదీ రాత్రి వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
డీఎస్సీ పోటీ పరీక్షల పై స్పెషల్ తరగతులను నిర్వహించనున్నట్లు టీ -శాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. టీ శాట్ ఛానెల్ లో వివిధ సబ్జెక్టుల పై ఈ నెల 18 నుంచి తొమ్మిది రోజుల పాటు ప్రత్యక్ష ప్రసారాలుంటాయని ఆయన వెల్లడించారు.
లక్ష్యం ముందు పేదరికం చిన్నదని నిరూపించాడు కరీంనగర్ బిడ్డ. రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన బీడీ కార్మికురాలి కుమారుడు నందాల సాయికిరణ్ సివిల్స్ లో రెండో ప్రయత్నంలోనే 27వ ర్యాంకు సంపాదించాడు. తల్లి రెక్కల కష్టాన్ని చూసి కసిగా చదివి తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్ పల్లి గ్రామానికి చెందిన దయ్యాల తరుణ్ సివిల్స్ లో 231 ర్యాంకు సాధించాడు. తరుణ్ తల్లిదండ్రులు కూలీపనులు చేస్తూ కొడుకును చదివించారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తరుణ్..నగరంలోనే ఉన్నవిద్యను కూడా పూర్తి చేశారు.
రైల్వే శాఖలో సుమారు 4660 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆర్పీఎఫ్లో సబ్-ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నేటి నుండి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ 2023 పరీక్ష ఫలితాలు మంగళవారం రిలీజ్ అయ్యాయి. యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పాలమూరు పేదింటి బిడ్డ సత్తా చాటింది. తొలిప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించింది. దోనూరు అనన్య రెడ్డి సక్సెస్ గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.