TG Group-1: తెలంగాణలో గ్రూప్-1 వివాదం కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలు జరగనుండగా.. ఎగ్జామ్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవో 29ను రద్దు చేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే గ్రూప్-1పై కోర్టుల్లో ఉన్న కేసులు కొలిక్కివచ్చాకే పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే జీవో 29, జీవో 55 ఏం చెబుతోంది? దీనిని అభ్యర్థులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే వివరాళ్లోకి వెళితే..
ఇది కూడా చదవండి: TN: హిందీని రుద్దకండి..మళ్ళీ రాజుకున్న వివాదం..మోదీకి స్టాలిన్ లేఖ
జీవో 55..
జీవో-55 ప్రకారం.. 1 ఉద్యోగానికి రిజర్వేషన్ సహా అన్ని కేటగిరీల నుంచి 50 మందిని ఎంపిక చేస్తారు. మిగతా రిజర్వుడ్ పోస్టులకు ఆయా అభ్యర్థులకే అవకాశం కల్పిస్తారు. రిజర్వుడ్ అభ్యర్థులకు వారి కోటాతోపాటు ఓపెన్ కోటాలోనూ ఉద్యోగం పొందేందుకు అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: సైబర్ స్కామ్.. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మహిళ బట్టలు విప్పించి..!
జీవో 29..
ఇక జీవో-29 ప్రకారం ఓపెన్ కోటాలో రిజర్వుడ్ అభ్యర్థులకు ఉద్యోగం పొందే అవకాశం ఉండదు. మెరిట్ ర్యాంకు వచ్చినా రిజర్వేషన్ ప్రకారం రిజర్వుడ్ అభ్యర్థులకు ఛాన్స్ ఉండదు. దీంతో GO 29 రద్దు చేయాలని అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జీవో 29 రద్దుతోపాటు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ధర్నాలకు దిగుతున్నారు. ఇక గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 31 వేల మంది క్వాలిఫై అయితే 34 వేల మందిని మెయిన్స్ పరీక్షలను ఎలా అనుమతిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గ్రూప్-1పై న్యాయస్థానాల్లో ఉన్న కేసులు కొలిక్కివచ్చాకే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏమీ పట్టనట్లు మొద్దు నిద్ర..
ఇదిలా ఉంటే.. జీవో 29 విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టనట్లు మొద్దు నిద్ర పోతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఓపెన్ కాంపిటేషన్ (OC) లేదా అన్ రిజర్వుడ్ కేటగిరీ లో బహుజనులకు (SC/ST/BC/Minority/EWS) ప్రవేశం లేదంటున్న కాంగ్రెస్ ప్రభుత్వపు అక్రమ GO 29 విషయంలో ఏమీ పట్టనట్లు మొద్దు నిద్ర పోతుంది అధికార పార్టీ. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలారా మీరు ఏ వర్గాల నుండి వచ్చిండ్రో ఆ వర్గ ప్రయోజనాల కోసం గళ మెత్తలేనప్పుడు మీరు పవర్ లో ఉంటే ఏంది, ఊడితే ఏంది?? ఇటీవలే బీసీ ముఖ్యమంత్రి కావాలే అని తిరిగిన కాంగ్రేసు ఎమ్మెల్సీ గారి గొంతుక ఎందుకో సడన్ గా మూగబోయింది? బాధితుల్లో బీసీ బిడ్డలు కూడా ఉన్నరు కదా భయ్యా? అంటూ పోస్ట్ పెట్టరు.
ఇది కూడా చదవండి: సిన్వర్ చనిపోయే ముందు డ్రోన్ ఫొటేజ్.. వైరల్ అవుతున్న వీడియో
ఆత్మగౌరవం ఉన్నా సీయం రేవంత్ రెడ్డి..
అన్నలారా.. మీ అందరికి ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా సీయం రేవంత్ రెడ్డిని వెంటనే నిలదీయండి. మొండిగా మెజారిటీ వర్గాల ప్రయోజనాలను తుంగలో తొక్కి, ఒక వర్గానికే కొమ్ము కాస్తున్న టీజీపీఎస్సీ బోర్డును రీకాల్ చేయించండి. ఇవన్నీ చేతకాక పోతే అందరూ రాజీనామా చేసీ అశోక్ నగర్ కు రాండి. మన బిడ్డల తరపున పోరాడదాం. ఇజ్జత్ అన్నా దక్కుతది. మెజారిటీ జనం ఉండి కూడా లక్షల రూపాయలు అప్పులు చేసి కోర్టు లో తమ హక్కుల కోసం లాయర్ల ద్వారా నిస్సహాయ స్థితిలో ఈ బహుజన బిడ్డలు చేస్తున్న పోరాటం చూస్తే కళ్లలో నీళ్ళు తిరిగినయి. ఈ బిడ్డల గోసను ఓపికగా విని వాళ్ల సమస్య పరిష్కారం కోసం, సామాజిక న్యాయం కోసం, అత్యున్నత న్యాయస్థానాన్నైనా ఆశ్రయించడానికి వెనుకాడబోమని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: వివాదంలో ఇరక్కున్న సీఎం కుమారుడు.. ఏం చేశాడంటే ?