T-Sat : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాలకు ఫ్రీగా కోచింగ్!

స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి టీ-శాట్ ఆన్‌లైన్‌లో ఫ్రీగా కోచింగ్ ఇవ్వనుంది. ఈ విషయాన్ని టీ-శాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం రెండు గంటల పాటు టీ-శాట్‌ ఛానెళ్లలో క్లాస్‌లు ఇస్తారు.

TSAt
New Update

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ భర్తీ చేసే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ అందించనున్నట్లు టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 21 సోమవారం నుంచి జనవరి 31 వరకు టీ-శాట్ నెట్‌వర్క్ ఛానళ్ల ద్వారా ఆన్‌లైన్‌లో ఉచితంగా క్లాస్‌లు అందించనున్నారు.

ఇది కూడా చూడండి: విశ్వవిజేతులుగా కివీస్.. మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్

ప్రత్యేకమైన క్లాస్‌లు..

సెప్టెంబర్ 6వ తేదీన 39,481 జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన క్లాస్‌లకు ఉచితంగా కోచింగ్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్‌లో తెలంగాణ నుంచి 718 మందికి ఏపీ నుంచి 908 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ప్రత్యేకంగా టీశాట్‌తో క్లాస్‌లు నిర్వహిస్తామని సీఈవో తెలిపారు.

ఇది కూడా చూడండి: మారథాన్‌లో సీఎం.. 2 గంటల్లో 21 కిలోమీటర్లు

ఆన్‌లైన్‌లో నాణ్యమైన కోచింగ్‌ను విద్యార్థులకు ఇస్తామన్నారు. మొత్తం 112 రోజుల పాటు జరిగే ఈ ఆన్‌లైన్ క్లాసులో 448 ఎపిసోడ్‌లు ఉంటాయని తెలిపారు. దాదాపుగా 224 గంటల పాటు కోచింగ్‌ను నెట్‌వర్క్ చానెళ్లు, యూట్యూబ్, యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రసారం చేస్తామన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు టీ శాట్‌లో క్లాస్‌లు ప్రసారం చేయగా.. మరుసటి రోజు ఉదయం 5 నుంచి 7 గంటల వరకు కూడా విద్యా ఛానెల్‌లో ప్రసారం అవుతాయని తెలిపారు. 

ఇది కూడా చూడండి: మాస్ స్టెప్‌లతో డ్యాన్స్ అదరొగొట్టిన మాజీమంత్రి .. నెట్టింట వైరల్!

పోటీ పరీక్షలకు ముఖ్యంగా నాలుగు సబ్జెక్టులు అయిన జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్ నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లలో క్లాస్‌లు అందించనున్నట్లు సీఈవో వేణుగోపాల్ తెలిపారు. ఇదిలా ఉండగా.. టీజీపీఎస్సీ నవంబర్ 17న నిర్వహించనున్న 1,388 గ్రూప్ 3 పోస్టుల పోటీ పరీక్షలకు కూడా మళ్లీ రెండు గంటల పాటు క్లాస్‌లను అందించనున్నారు. 

ఇది కూడా చూడండి: Frog: ట్రిపుల్‌ఐటీ మెస్‌ బిర్యానీలో కప్ప.. కాదు కాదు కప్ప బిర్యానీ!

#telangana-jobs #staff-selection-commission #t-sat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe