విశ్వవిజేతులుగా కివీస్.. మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్

దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ మహిళల కప్‌లో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. 32 పరుగులతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి.. తొలిసారిగా ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది.

New Update
Newzland

మహిళల టీ20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌ జట్టు విశ్వవిజేతులగా విజయం సాధించింది. అటు టెస్ట్‌ మ్యాచ్‌లలో పురుషులు 36 ఏళ్ల తర్వాత భారత్ గడ్డపై విజయం సాధించగా.. మహిళల జట్టు కూడా ప్రపంచ్ కప్‌లో గెలిచింది. న్యూజిలాండ్‌ మహిళల జట్టు ప్రపంచ కప్ సాధించడం ఇదే మొదటిసారి.

ఇది కూడా చూడండి: ప్రియురాలిని చూసి సృహ తప్పిన ప్రియుడు.. తర్వాత ఏమైందంటే?

32 పరుగులతో దక్షిణాఫ్రికాపై..

దుబాయ్ వేదికగా జరిగిన ఈ టీ20 ప్రపంచ కప్‌లో 32 పరుగులతో దక్షణాఫ్రికాపై కివీస్ విజయం సాధించింది. మొదట కివీస్‌ 20 ఓవర్లలో 158/5 స్కోరు చేసింది. అమీలీ కెర్‌ (43), బ్రూక్‌ హాలీ డే (38), సుజీ బేట్స్‌ (32) సత్తా చాటారు. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 126/9 స్కోరుకే పరిమితమైలా కివీస్ చేసింది.

ఇది కూడా చూడండి: మారథాన్‌లో సీఎం.. 2 గంటల్లో 21 కిలోమీటర్లు

గతంలో రెండుసార్లు 2009, 2010లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌ ఈసారి తగ్గేదేలే అంటూ ట్రోఫీని దక్కించుకుంది. ఉదయం టెస్ట్ మ్యచ్‌లో పురుషులు, రాత్రి మహిళల జట్టులో కివీస్‌ విజయం సాధించింది. ఈ టీ20 ప్రపంచ కప్‌లో మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. పురుషుల జట్టుకు సాధ్యం కాని ఘనతను మహిళలు సాధించారు.

ఇది కూడా చూడండి:Jammu: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో డాక్టర్ సహా ఆరుగురు మృతి

ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది టీ20 ప్రపంచ కప్‌లు జరగ్గా.. అందులో ఆస్ట్రేలియా 6 సార్లు, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ ఒక్కోసారి విశ్వవిజేతలుగా నిలిచాయి. దక్షిణాఫ్రికా కూడా ఇప్పటి వరకు ఒక ప్రపంచ కప్‌ను కూడా సాధించలేదు. ఈ ఏడాది జరిగిన పురుషుల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమి పాలవ్వగా.. ఇప్పుడు అమ్మాయిల జట్టు కూడా ఓటమి పాలయ్యింది. 

ఇది కూడా చూడండి: Vaccination: పిల్లలకి ఏ వయసులో ఏ టీకా వేయించాలి?

Advertisment
Advertisment
తాజా కథనాలు